Monday, December 1, 2014

చలికాలంలో దగ్గుకు తక్షన ఉపశమనం కలిగించే హోం రెమెడీస్


చలి ఎక్కువగా ఉంటోంది కదూ. ఈ సీజన్‌లో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. చలికాలంలో వచ్చు దగ్గు మరియు జలుబు, ఫ్లూకు చాలా సాధరణ లక్షణం. తరచూ దగ్గుతున్నప్పుడు గుండెల్లో మంటగా మరియు శరీరం అలసటగా మారుతుంది. ఫ్లూ మాత్రమే కాకుండా అలర్జీ, ఆస్తమా, డ్రై ఎయిర్ మరియు స్మోకింగ్ వంటివి కూడా దగ్గుకు కారణం అవుతాయి. దగ్గనుండి త్వరగా ఉపశమనం పొందడానికి అలోపతి డ్రగ్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటాయి. ఈ మందులే చాలా ఎఫెక్టివ్ గా త్వరగా ప్రభావం చూపుతాయని నమ్ముతాము. అయితే వీటికంటే మరింత ఎఫెక్టివగ్ గా త్వరగా ఉపశమనం కలిగించే కొన్ని హోం రెమెడీస్ కూడా కలిగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఈ హోం రెమెడీస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్వరగా దగ్గు మరియు జలుబును తగ్గిస్తాయి. ఈ హోం రెమెడీస్ మీ వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి . తరచూ వచ్చే దగ్గు మరియు క్రోనిక్ దగ్గును నివారించుకోవాలంటే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మరి, చలికాలంలో దగ్గును నివారించి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఎంటో ఒక సారి చూద్దాం...

గోరువెచ్చని నీరు:   శరీరాన్ని ఏ సీజన్ లో అయినా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు నీరు ఒక ఉత్తమ హోం రెమెడీ. గోరువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. మీరు పొడి దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా పొడి దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది.


No comments:

Post a Comment