Friday, September 26, 2014

గర్భిణీలు సహజంగా వచ్చే ఆరోగ్యసమస్యలు

మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే
. బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్, తిమ్మిరులు, వైజినల్ డిస్చార్జ్, లీకింగ్ నిప్పల్స్ మరియు ఒళ్ళు నొప్పులు మొదలగునవి మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భణి స్త్రీలో వచ్చేటటువంటి సాధారణ ఆరోగ్యసమస్యలు. గర్భిణీ స్త్రీ పొట్టలో పిండం పెరిగే కొద్ద పొట్ట మరియు బ్రెస్ట్ పెరగడంతో పాటు, శరంల కూడా అనేక మార్పలకు లోనవుతుంది. ఉదాహరణకు: గర్భం ధరించగానే, గర్భిణీలో చర్మం స్ట్రెచ్ (సాగడం మొదలవుతుంది మరియు ఇది తరచూ స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో ఛారలు)ఏర్పడటానికి కారణం అవుతుంది. గర్భం ధరించిన మహిళ చూడటానికి మరింత అందంగా కనిపించడం కానీ లేదా మరింత నీరసంగా, డల్ గా కనిపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, మనస్సులో గందరగోళం, తరచూ మనస్సు మార్చుకోవడం, మరియు వికారం వంటి సాధారణ సమస్యలు అసౌకర్యానికి గురిచేస్తాయి. అదేవిధంగా, వికారం, మార్నింగ్ సిక్ నెస్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగు, ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మార్పుల వల్ల అసౌకర్యంగాను మరియు చిరాకుగాను అనిపిస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో వారు చాలా ఆందోళకరమైనవారుగా అనిపించవచ్చు. గర్బిణీ స్త్రీలు ఎదుర్కొనే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు మీరు తెలుసుకోవడం కోసం కొన్ని ఇక్కడ అంధిస్తున్నాం.

వాంతులు  
వికారం, వాంతులు ఈ సమస్య వున్నవారు ఉదయం అతి మెల్లగా పడకపైనుండి లేవాలి. లేచిన వెంటనే ద్రవపదార్ధాలు కాకుండా పొడిగా వుండే పదార్ధాలు లేదా బిస్కట్ వంటివి తీసుకోవాలి. ఎపుడు కావాలంటే అపుడు కావలసినంత వివ్రాంతి, నిద్ర తీసుకోవాలి. ఆహారం కొద్దిగాను, తరచుగాను తీసుకోవాలి. ద్రవాలు అధికంగానే తీసుకోండి. తినటం మానరాదు. ఇది పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తుంది.

No comments:

Post a Comment