Friday, July 18, 2014

పిల్లలు చదువుపై ఏకాగ్రత, శ్రద్ద పెట్టాలంటే...

 ప్రతి రోజూ కిలోలకు కిలోల బరువుండే బ్యాగులు భుజాలకు వేసుకుని పిల్లలు స్కూలుకు వెళ్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే రోజంతా వాళ్ళు స్కూల్లో.
. టీచర్లు చెప్పిన పాఠాలు వినడం, నోట్స్ రాసుకోవడం, పరీక్షలు, ఆటలు, ఇలా బిజీబిజీగా గడుపుతుంటారు. తీరా ఇంటికొచ్చేసరికి అలసిపోతారు. ఇంకేముంది తినేసి పడుకోవడమే... చదువుపై కూడా శ్రద్ద పెట్టలేకపోతారు. మరి ఇలా అయితే ఎప్పుడు చదువుకుంటారనేగా మీ డౌటు? డోంట్ వర్రీ...పిల్లలు స్కూలు నుంచి అలసిపోయి వచ్చినా వాళ్లు శ్రద్దగా చదువుకునే మార్గాలూ లేకపోలేదు..
ప్లాన్ ప్రకారం: 
స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లులు ఏమేం చేయాలనే దానిపై ఓ ప్లాన్ తయారు చేసి పెట్టాలి. వచ్చిన తర్వాత ఫ్రెషప్ అవ్వడం, స్నాక్స్ తినడం, హోం వర్క్ చేసుకోవడం, చదువుకోవడం, వేళక తినడం, నిద్రపోవడం..ఇలా టైమ్ టు టైమ్ ప్రణాళిక తయారుచేసి పెట్టే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది.

No comments:

Post a Comment