Friday, June 20, 2014

గర్భదారణ సమయంలో ఫిట్

సాధారణంగా చాలా మంది స్త్రీలు గర్భధారణ అంటే భయపడుతుంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో శరీరంలో హార్మోనుల్లో అనేక మార్పులు,
కొన్ని సమస్యలు మరియు ప్రసవ నొప్పులు మరియు ప్రసవం వంటి వాటికి భయపడుతుంటారు. అలాగే గర్భం పొందిన తర్వత కడుపులో పెరిగే బిడ్డవల్ల తల్లిలో బరువులో మార్పులు, చర్మంలో మార్పులు మరియు బేబీ బంప్ వల్ల మార్పులు సహజం. అటువంటప్పుడు గర్భిణీలు ఒక పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ తో మరియు ఆత్మగౌరవం కలిగి ఉండటం చాలా అవసరం. దాంతోనే గర్భధారణ పూర్తికాలంలో సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన గర్భదారణ కాలంను పూర్తి చేయగలరు. అలాగే అందం విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కానీ వారు కూడా ఉంటారు. గర్భం పొందగానే అన్ని సింపుల్ గా, డల్ గా మరియు అన్ ఫ్యాషనబుల్ గా ఉండాల్సిన పనిలేదు, వీటికి బదులుగా మీ స్త్రీత్వం మరియు మాతృత్వంతో సంతోషంగా గడపగలిగే వాతావరణంను ఏర్పరుచుకోవాలి . అయితే గర్భధారణ సమయంలో సహజంగానే గర్భిణీలు చూడటానికి ఫిట్ గా మరియు సెక్సీగా కనబడాలంటే? ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి...

వర్కౌట్: వర్కౌట్: మీ గర్భధారణ సమయంలో వారంలో రెండు రోజులు వ్యాయం చేయడం మంచిది. వ్యాయామం అంటే నడక, స్విమ్మింగ్, యోగా మరియు వాటర్ ఏరోబిక్ వంటివి డాక్టర్ ను సంప్రధించి చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా గర్భం పొందడానికి ముందు మీరు ఎలా ఉన్నారో అలాగే చురుకుగా ఉండేవిధంగా సహాయపడుతుంది.అలాగే వ్యాయామం చేసే సమయంలో ఎక్కువ నీళ్ళు త్రాగాలి . ఇది మీ ఫీలింగ్స్ ను రిఫ్రెష్ చేయడమే కాకుండా మీ శరీరానికి పూర్తి హైడ్రేషన్ ను అంధిస్తుంది మరియు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తుండేట్లు చేస్తుంది.

No comments:

Post a Comment