Monday, May 19, 2014

పిల్లలతో మాట్లాడడం మంచి పేరెంటింగ్ ఎలా ఔతుందనేదానికి కారణాలు !!

తల్లితండ్రులు మాల్స్ వద్ద లేదా డాక్టర్ క్లినిక్ కి తీసుకు వెళ్ళేటపుడు పిల్లలతో మాట్లాడుతూ ఉండడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. పిల్లలు మన మాటలను అర్ధం చేసుకోలేరని చాలామంది ఎగతాళి చేస్తారు. అయితే, పిల్లలతో మాట్లాడడం అనేది మంచి పెరెంటింగ్ పద్ధతి. మీ బిడ్డ అమ్మాయి లేదా అబ్బాయి ఆలోచన మీకంటే తెలివిగా ఉండొచ్చు. పిల్లలతో మాట్లాడడం వల్ల వారి మెదడు ఆ మాటలను చురుకుగా అందుకునదానికి కూడా సహాయపడుతుంది. చిన్నతనం నుండే పిల్లలతో మాట్లాడుతూ ఉండడం అనేది పిల్లలకు త్వరగా మాటలు రావడానికి ఒక మంచి మార్గం. మీరు కొన్ని వారాల వయసు చిన్నారులతో మాట్లాడుతూ ఉన్నపుడు వారి వినికిడి శక్తిని కూడా మీరు గ్రహించగలుగుతారు. ఇది మీ పిల్లలకు మాటలు త్వరగా రావడానికి సహాయపడుతుంది. పిల్లల మనసు మనకంటే చాలా ఎక్కువ పదునుగా ఉండి, వారు ఆ ఆ మాటలను త్వరగా గ్రహించ గలుగుతారు. పిల్లలతో మాట్లాడడం వంటి కొన్ని మార్గాల వల్ల వారి మెదడు చాలా త్వరగా అభివృద్ది చెందడానికి సహాయపడుతుంది. పిల్లలతో మాట్లాడడం మంచి పేరెంటింగ్ ఎలా ఔతుందనేదానికి కారణాలు !! 
భాషా ప్రవృత్తి 
మీరు భాష నేర్చుకునేటపుడు, మొదట ఏమి నేర్చుకుంటారు; గ్రామరా లేక పదాలా? చాయా సందర్భాల్లో భాష స్వాభావికంగా నేర్చుకుంటాం, అందుకే ఎలాంటి వ్యాకరణం రాకుండానే మన మాతృభాష మాట్లాడడం నేర్చుకుంటాం. పిల్లలతో మాట్లాడం వల్ల వారిలో భాషా ప్రవృత్తిని పెంపొందించవచ్చు. 
మాట్లాడడం లో మొదటి
 మెట్టు మాట్లాడడానికి మొదటి మెట్టు నిజానికి వినడం. మనం ఒక అక్షరాన్ని వింటేనే దాన్ని గట్టిగా ఉచ్చరించగలుగుతాము. అందువల్ల తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు వినడం పిల్లలు చక్కగా మాట్లాడడానికి తొలి మెట్టు. అందుకని పిల్లలతో మాట్లాడే తొలినాళ్ళలో పెద్ద ‘బాబా’ , ‘మామ్మా’, ‘టాటా’ లాంటి చిన్న చిన్న పదాలు మాట్లాడాలి. మీరు పూర్తి వాక్యాలు మాట్లాడుతుంటే వాళ్లకి గ్రామర్ గురించి కూడా కొద్దిగా సూచనలు అందుతాయి. కానీ పిల్లలు వాక్యాలు మొత్తం పట్టుకు౦టారని అనుకోవద్దు. మెల్లిగా కొన్ని శబ్దాలు మాట్లాడటం తో మొదలు పెడతారు. 
 బహు-భాషలు
 బహు భాషా మాయమైన ప్రపంచంలో ఉంటున్నాం మనం. కాబట్టి మీ పిల్లవాడు ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. అందుకే మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒక్క భాష మాత్రమె మాట్లాడండి. ఉదాహరణకు, మాట్లాడేటప్పుడు ఇంగ్లీషు, హిందీ కలిపి మాట్లాడక౦డి. వారు ఆ భాషలను విడి విడిగా నేర్చుకునే అవకాశం కల్పించండి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు పిల్లలకు చాలా సారవంతమైన మెదళ్ళు వుంటాయి కనుక, వాళ్ళకి అర్ధంగాని భాషల మిశ్రమం మాట్లాడకండి. ఒక హెచ్చరిక
 పిల్లలు చాలా ధారణ కలిగి వుంటారు. మీ సంభాషణ నుంచి వాళ్ళు ఏ పదం నేర్చుకుంటారో మీరు చెప్పలేరు. అందుకని పిల్లలతో మాట్లాడే ముందు యథాలాపంగా ఏదో చెడ్డ పదం లేదా బూతులు వాడకండి. ఎందుకంటే మీ పిల్లవాడు ఏదో నాలుగు అక్షరాల పదం నేర్చుకోవాలని మీరు అనుకోరు,అవునా?

No comments:

Post a Comment