ఇది మీరు అనుకునే నీళ్లు నమలడం కాదు... నీళ్లు నిండుగా ఉండే పుచ్చకాయ, టొమాటో లాంటివి నమలడం, లస్సీ, మజ్జిగలను చప్పరించడం.
పండ్లు తినడం అన్నమాట. ఈ సీజన్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతాం. అది అవసరం కూడా. కానీ... పిల్లలు ఎండలో ఆడుకుంటూ ఆ విషయమే మర్చిపోతారు. కొందరు పనులపై బయటికి వెళ్లినప్పుడు కుదరక నీళ్లు తాగలేరు. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య బాధిస్తుంది. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ నీళ్లు నమలడం పొరబాటు కానే కాదు. దీన్ని నిక్షేపంగా చేయవచ్చు. అదే... ఈ వారం ముందుజాగ్రత్త. ఒక సీజను నుండి మరొక సీజనులోనికి అడుగుపెట్టేటప్పుడు వాతావరణ మార్పులవలన చలికాలం నుండి వేసవికాలంలో క్యాజువల్ ఎలర్జీ కండిషన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ధూళి, దుమ్ము, జలుబు, జ్వరం, ఫ్లూవ్యాధులు చిన్నపిల్లలు గాలి పీల్చేటప్పుడు వస్తాయి. ఇవికాక పిల్లల్ని నీరసపెట్టే విరోచనాలు వస్తాయి. మరీ ఎక్కువైతే డీలాపడిపోయిన సందర్భాలలో సెలైన్ బాటిల్స్ ఎక్కించాలి. డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు పడాలి. వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసేరోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి. వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అది నీరు కావచ్చు, పండ్ల రసాలు కావచ్చు, దీనివలన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి, వేసవిలో పిల్లలకు అందివ్వాల్సిన హెల్తీ ఫుడ్స్ మీకోసం...

No comments:
Post a Comment