Tuesday, April 29, 2014

టైల్ పై సిలిండర్ త్రుప్పుమరకలను పోగొట్టే ...

 మీరు ఉండే ఇంట్లో టైల్స్ సెరామిక్ టైల్స్ అయితే, అప్పుడు మీ వంటగదిలో ఎదుర్కొనే సమస్య ఒకటి ఇది . వంటగదిలోని సెరామిక్ టైల్స్ మీద గ్యాస్ సిలిండర్ త్రుప్పు మరకలు చాలా మెండిగా ఏర్పడుతాయి. ఈ మరకలను తొలగించడానికి చాలా కష్టపడుతుంటారు మహిళలు. అందువల్ల కొన్ని హోం రెమడీస్ తో ఈ మొండిగా తయారైన త్రుప్పు మరకాలను తొలగించడానికి ఉపయోగించి మీ వంటగదిలోని టైల్స్ ను మెరిసేలా ఉంచుకోండి. ఫ్లోర్ టైల్స్ మీద ఏర్పడిన రస్ట్ (త్రుప్పు)మరకలను వదిలించుకోవడానికి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ మార్కెట్లో లభించే రసాయనిక కెమికల్స్ తో తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల త్రుప్పు మరకలు వదలకు, మరిన్ని మరకలు ఏర్పడటానికి దారితీస్తుంది . కొంత మంది ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించి విసిగి వేసారిపోయి, కొన్ని సందర్భాలు షార్ప్ గా ఉండే చాకుతో గోకి లేదా మెటల్ స్ర్కబ్బర్ తో రుద్ది మరీ శుభ్రం చేస్తుంటారు. అయితే ఇది అంత మంచి ఉపాయం కాదు, ఇది టైల్స్ ను మరింత డ్యామేజ్ చేస్తాయి. అందువల్ల బోల్డ్ స్కై మీకోసం కొన్ని సులభ చిట్కాలను ఈ క్రింది విధంగా అందిస్తోంది. 

నిమ్మరసం:
ఇంట్లో ఎటువంటి మొండిమరకలైనా సరే నిమ్మరసం ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. వంటగదిలో సిలిండర్ పెట్టిన చోటో త్రుప్పు మరకలను తొలగించడానికి కొద్దిగా నిమ్మరసం చిలకరించి పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత టూత్ బ్రష్ ఉపయోగించి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే చాలా స్మూత్ గా త్రుప్పు మరకలు మాయం అవుతాయి.

1 comment:

  1. Bhale baavunde........repe try chesthaanu.thanks guruujee...

    ReplyDelete