గర్భధారణ సమయంలో మీకు కొత్త అనుభూతి మరియు మీ కుటుంబంలో కొత్త సభ్యుని ఆహ్వానించడం మీద మీ దృష్టి అంతా ఉంటుంది. మీ గర్భం గురించి తెలుసుకోవటానికి
అనేక విషయాలు ఉన్నాయి. అయితే మీ రెండవ త్రైమాసికం ముగింపు చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయం. ఆరు నెలల గర్భంలో శిశువు మరియు మీ శరీరంలో అనేక మార్పులు జరిగే సమయం అని చెప్పవచ్చు. శరీరంలో మార్పులు జరిగే కొద్ది, గర్భిణీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ శరీరానికి, మనస్సుకు సౌకర్యవంతంగా మార్చుకోవాలి. అటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం... బ్లౌజ్ లూజ్ గా వుంటేనే మంచిది. టైట్ గా ఉండే వస్త్రాలు రక్తప్రవాహానికి ఇబ్బంది కలిగిస్తుంది. బ్రా అంత టైట్ గానూ వద్దు, అంత లూజ్ గానూ వద్దు. గర్భావస్థలో స్థనాలు పెరుగుతాయి అందువలన అవి జారిపోకుండా ఉండేందుకు తగినట్లుగా జాకెట్ ఉండాలి. హై హీల్స్ శాండిల్ వేసుకోకూడదు. ప్లాట్ శాండిల్స్ చెప్పులు మంచిది. సింథెటిక్, పాలియస్టర్, నైలాన్ వస్త్రాలకు దూరంగా వుండాలి. ఇవి చర్మానికి మంచిదికాదు. ఈ వస్త్రాలు దురదలకు కారణం కావచ్చు. వంటింట్లో పనిచేసేటపుడు సాదా రబ్బరు చెప్పులు కాటన్ వస్త్రాలు వాడాలి. ఈ స్థితిలో ఎప్పుడూ స్టూల్, టేబుల్ పై ఎక్కి పనిచేయ్యద్దు. మెట్లు ఎక్కిదిగేటపుడు జాగ్రత్తగా వుండాలి. మెల్లగా ఎక్కిదిగాలి. తొందరపాటు పనికిరాదు. గర్భిణి స్త్రీలు తమ బరువు పెరుగుతున్నారా? లేదా? గమనించుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నట్లే. కనుక డాక్టర్ను సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి. గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు . పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు. పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.

No comments:
Post a Comment