ఆకాశంలో సగం, దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు క్రీడారంగంలో మాత్రం పురుషులతో సమానంగా ఆదరణ, ప్రోత్సాహం లభించటం లేదు.
జాతీయ క్రీడ హాకీ నుండి అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్ వరకూ ఏ క్రీడ చూసినా మహిళలకు ఏమున్నది గర్వకారణం అనుకునేలా ప్రస్తుత పరిస్థితి తయారైంది. ట్రాక్ అండ్ ఫీల్డ్, హాకీ, క్రికెట్ క్రీడల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. టెన్నిస్ లో మాత్రమే పురుషులకు, మహిళలకు సమాన ఆదరణ లభిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంత మహిళా క్రీడాకారులకు అవకాశాల విషయంలో, సౌకర్యాల విషయంలో ఎంతో అంతరముంది. మరి ఎందుకీ అంతరాలు? మహిళల పట్ల ఎందుకీ వివక్ష.. ఇత్యాది అంశాలపై మానవి 'వేదిక' చర్చాకార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చాకార్యక్రమంలో విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ విజయలక్ష్మి , హాకీ క్రీడాకారిణి లు గీతా సాగర్, రుచిక, సాయిధారణి, లు పాల్గొన్నారు. వారు చెప్పిన మాటలను, అభిప్రాయాలను ఈ వీడియోలో చూడండి..

No comments:
Post a Comment