ఇంటిని శుభ్రత కొరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా, సరిపోవు. ఇంటి శుభ్రత
వల్లే, ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరం. ఇంట్లో ఎటువంటి దుమ్ము, ధూళి, క్రిమి
కీటకాలు లేకుండా చేయడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా కొందరు ఇంటి
పరిశుభ్రత కొరకు, రసాయనిక క్లీనింగ్ ఏజెంట్స్ మరియు నేచురల్ క్లీనింగ్
ఏజెంట్లను ఉపయోగిస్తుంటారు. ఇంట్లో మన నడిచే ఫ్లోర్ దగ్గర నుండి, ఫర్నీచర్,
వంటగది, పడకగది, లివింగ్ రూమ్, బాత్రూమ్ లు ఇలా అన్నీ శుచిశుభ్రతతో
పెట్టుకుంటుంటారు.
బాత్రూమ్ ల తర్వాత ఇంట్లో క్రిములు, కీటకాలు పొంచి ఉండే ప్రదేశం వంటగది.
ఎందకంటే, వంటగదిలో వంటసామాగ్రి, ప్రతిరోజూ వంటకు ఉపయోగించే పదర్థాలు, నిల్వ
ఉండే పదార్థాల వల్ల, క్రిములు చేరుతాయి. అంతే కాదు, వంటగదిలో పడే చెత్తా
చెదారం అంతే ఒక చోట (డస్ట్ బిన్/చెత్తబుట్టలో)పోగుచేస్తాయి. వాటిని
ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటి నుండి దుర్వాసన వస్తుంది. ఆ వాసన
ఇంట్లో ప్రతి చోటా వ్యాప్తి చెందుతుంది. మిమ్మల్ని ముక్కులు మూసుకొనేలా
చేస్తుంది. కాబట్టి, డస్ట్ బిన్ లోని చెత్తా చెదారంను వెంటనే తొలగించడానికి
వీలు కానప్పుడు, డస్ట్ బిన్ నుండి దుర్వాన నివారించుటకు...
నేఫ్తలీన్ బాల్స్: చెత్తబుట్టులో దుర్వాసన నివారించడానికి ముందుగా
డస్ట్ బిన్ కు కవర్ తొడగడానికి ముందుగా నేఫ్తలిన్ బాల్స్ ను వేయాలి.
నేఫ్తలీన్ బాల్స్ చాలా గాఢమైన వాసనను కలిగి ఉండి, చెడిన పదార్థాల మీద
వాప్తి చెందుతుంది. అందువల్ల మీరు రెగ్యులర్ గా డస్ట్ బిన్ కవర్స్ ను
ఉపయోగిస్తున్నట్లైతే, ఈ నేఫ్తలిన్ బాల్స్ వేసి ఒక వారం పాటు ఉంచవచ్చు .
వారంలో ఒకటి లేద రెండు సార్లు డస్ట్ బిన్ శుభ్రం చేసి, నేఫ్తలీన్ బాల్స్ ను
మార్చుతుండాలి.
బేకింగ్ సోడా: డస్ట్ బిన్ ను బేకింగ్ సోడాతో వాష్ చేయడం వల్ల వంటగది
పరిశుభ్రత మరియు దుర్వాసనను నివారించడానికి ఒక ఉత్తమ మార్గం. ఇంకా మీరు
డస్ట్ బిన్ చుట్టూ బేకింగ్ సోడాను చిలకరించవచ్చు. ఇది డస్ట్ బిన్
(చెత్తబుట్ట)చుట్టు ఉన్న వాసనను బేకింగ్ సోడా గ్రహిస్తుంది. మరో ప్రయోజనం
బేకింగ్ సోడాను డస్ట్ బిన్ లో చిలరించడం వల్ల దుర్వాసన నివారించడంతో పాటు,
డస్ట్ బిన్ మరకలను చాలా తేలికగా నివారిస్తుంది.
డ్రైయ్యర్ షీట్స్ : కిచెన్ డస్ట్ బిన్ లో డ్రైయ్యర్ షీట్స్ అమర్చడం వల్ల
చెత్త చెదారం డస్ట్ బిన్ కు అతుక్కోకుండా ఉంటుంది. మరియు డ్రైయర్ షీట్స్ ఒగ
గొప్ప యాంటీ ఆడర్ టూల్(దుర్వాసనను నివారించే ఒక వస్తువు). డస్ట్ బిన్ కు
క్లీన్ గా, కొత్తగా ఉండే డ్రైయ్యర్ షీట్ ను ఉపయోగించడం చాలా అవసరం. మీరు
పాత డ్రైయర్స్ ను లేదా ముందు ఉపయోగించిన డ్రైయ్యర్ ఫీట్స్ ఫ్రెష్ గా ఉంటే,
వాటిని తిరిగి మీరు ఉపయోగించవచ్చు.
బ్లీచ్: చెత్త, చెదారం మరియు తడిఆహారపదార్థాల వల్ల క్రిములు మరియు
బ్యాక్టీరియా డస్ట్ బిన్ కు అంటుకొనే ప్రమాదం ఉంది. అందువల్ల వాటిని నాశనం
చేయడం మరియు డస్ట్ బిన్ దుర్వాసనను నివారించడం చాలా అసరం. ఎటువంటి
ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండాలంటే, బ్లీచ్ ను ఉపయోగించాలి.
ఫ్రెష్నర్స్ : డస్ట్ బిన్ నుండి ఇంట్లో వాసన వస్తుంటే, వెంటనే ఆర్గానిక్
లేదా నేచురల్ ఫ్రెష్నర్స్ ను ఉపయోగించవచ్చు . అందుకు సిట్రస్ లేదా ఇతర రూమ్
ఫ్రెష్నర్స్ ను ఉపయోగించడం వల్ల చాలా సులభంగా ఇల్లు మొత్తం వ్యాపించి,
దుర్వాసను పోగొడుతుంది. డస్ట్ బిన్ వద్ద వాసన అలాగే వస్తుంటే, అక్కడ కూడా
రూమ్ ఫ్రెష్నర్ ను స్ప్రే చేయవచ్చు.

No comments:
Post a Comment