మంచి పోషకాహారం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాంటి మంచి పోషకాహారలు
హెల్తీ హెయిర్ గ్రోత్ కు కూడా చాలా ముఖ్యం. అందుకు ముఖ్యంగా మీరు
తెలుసుకోవాల్సిన విషయం జుట్టు ఎక్కువగా రాలుతున్నా, ఎక్కువ హెయిర్ డ్యామేజ్
ఉన్నా లేదా జుట్టు పెరగడం మందగించినా అందకు వెంటనే శ్రద్దతీసుకోవాలి .
జుట్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న కణజాలంగా ఉంటుంది మీరు తీసుకొనే ఆహారం
జుట్టు పెరుగుదలలో ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది . ఆరోగ్యకరమైన
జుట్టు పెరుగుదలకు వివిధ రకాల న్యూట్రీషియంట్స్ అవసరం అవుతాయి. అందులో
ముఖ్యంగా విటమిన్ ఎ, సి, ఇ మరియు నియాసిన్, విటమిన్ బి5, బి12, ఐరన్,
జింక్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, సిలికా, సల్ఫర్, మరియు జెర్మేనియం
వంటివి చాలా అవసరం అవుతాయి.
సాధారణంగా చాలా మంది జుట్టురాలే సమస్యను నివారించుకోవడం కోసం వివిధ రకాల
హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా ఖచ్చుచేస్తుంటారు. అయితే జుట్టు
రాలడంను నివారించుకోవడం ఉత్తమ మార్గం మరియు జుట్టు పెరుగుదలకు
పెంచుకోవడానికి అందంగా జుట్టు కనబడేలా చేసుకోవడానికి మీరు
తీసుకోవల్సినటువంటి ప్రత్యేక శ్రధ్ద మీరు తీసుకొనే ఆహారం. మీరు తీసుకొనే
ఆహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు
జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి. అటువంటి టాప్ 10 ఆహారాలు, క్రింది
విధంగా ఉన్నాయి.

No comments:
Post a Comment