Wednesday, February 5, 2014

గర్భిణీలు విటమిన్ లు అధికంగా తీసుకుంటే కలిగే దుష్ఫలితాలు

మహిళ గర్భవతి గా వున్నపుడు, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా, బలంగా ఉండాలంటే ఆమె మంచి ఆరోగ్యకరమైన మరియు పోషకాలు అంటే విటమిన్ లు, ప్రోటీన్ లు, మినరల్స్ మొదలైనవి కల ఆహారం తీసుకోవాలి. మహిళ ఈ విటమిన్ లను అనేక ఆహారాల నుండి, పండ్లు, ధాన్యాలు, కాయలు, మొదలైన వాటి నుండి పొందగలదు. అయితే, ప్రధానంగా ఈ విటమిన్ లు ఆమె ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. గర్భవతిగా వున్నపుడు, అధిక మోతాదులో కనుక ఈ విటమిన్ లు తీసుకుంటే, అతి క్లిష్ట సమస్యలు ఏర్పడగలవు. గర్భవతి మహిళకు ఎంత మోతాదులో విటమిన్ లు కావాలి అనే అంశం మా ఆర్టికల్ " గర్భవతి మహిళకు అవసరమైన విటమిన్ లు" అనే దానిలో పేర్కొనటం జరిగింది. మీరు కనుక విటమిన్ లను సహజ పదార్దాలైన పండ్లు, కాయ గూరలు మొదలైన వాటి నుండి తీసుకుంటే ఎట్టి సమస్య లేదు. ఎందుకంటే, మీకు, మీ గర్భానికి ఎట్టి సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. కాని, మీరు కనుక విటమిన్ సప్లిమెంట్ లను అంటే విటమిన్ మాత్రలు, పౌడర్, మొదలైనవిగా తీసుకుంటే అపుడు మీరు డాక్టర్ ను సంప్రదించి తీసుకొనవలసి వుంటుంది. ఎందుకంటే, విటమిన్ లు అధికం అయితే, మీ ఆరోగ్యానికి, పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ ఆర్టికల్ లో మేము విటమిన్ లు అధిక మోతాదులో తీసుకుంటే దుష్ఫలితాలు ఎలా వుంటాయి అనేది వివరిస్తున్నాం.

No comments:

Post a Comment