Tuesday, February 18, 2014

తెల్ల జుట్టు నివారించే హెల్తీ ఫుడ్...

సాధారణంగా వయస్సు పెరిగే కొద్ది గ్రే హెయిర్ (తెల్ల జుట్టు)ఏర్పడటం వల్ల వయస్సైన వారిగా కనబడుతుంటారు. ముఖ్యంగా చిన్న వయస్సులో తెల్ల జుట్టు కనబడితే చాలా బాధిస్తుంది. మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు వల్ల యువకుల్లో గ్రేహెయిర్ పొందడం ఒక సహజ విషయంగా మారింది. అదే విధంగా ఒత్తిడి కూడా గ్రే హెయిర్ కు ఒక ప్రధాన కారణం. జుట్టు రాలడం మరియు జుట్టు కోల్పవబడ వంటి కారణాల వల్ల హెయిర్ పిగ్మెంటేషన్ వల్ల గ్రేహెయిర్ కు ప్రధాన కారణం అవుతుంది. ఇంకా జీన్స్ లేదా వయస్సు కూడా ప్రధాణ కారణం అవుతుంది. జుట్టు గ్రేకలర్ లోకి మారడానికి మరో ప్రధాన కారణం పోషకాహారం లోపం. ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పోషకాహార లోపం వల్ల జుట్టు గ్రేగా మారుతుంది. ప్రతి రోజూ మన శరీరానికి అవసరం అయ్యే తగినన్ని పోషకాలను అంధించడానికి, అవసరం అయ్యే పోషకాహారం తీసుకోవడం వల్ల గ్రేహెయిర్ ను నివారించడంతో పాటు, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. అందువల్ల మనం తీసుకొనే ఆహారంలో అత్యధిక పోషకాలున్న ఆహారంను మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలను, అలాగే గ్రే హెయిర్ ను నివారించే ఆహారాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. జుట్టు మూలాల్లో మెలాన్ అనే అంశం తగ్గిపోవడం వల్ల జుట్టు గ్రేగా మారడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి, కొన్నిజుట్టుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మెలా ఉత్పత్తి పెంచడంతో పాటు, గ్రే హెయిర్ ను నివారిస్తుంది. మరియు ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అంధిస్తుంది.
మరో ప్రక్క కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ మరియు అనీమియా వంటి వ్యాధులు, జుట్టును తెల్లబర్చడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి. అలాగే ఎవరైన పొట్ట సంబంధిత సమస్యలతో భాదపడే వారికి కూడా జుట్టు గ్రే గా మారడానికి కారణం అవుతుంది. పొట్టలోకి విటమిన్ బి12 అందకపోతే, లేదా ఏదైనా సర్జరీ వల్ల కూడా గ్రేహెయిర్ కు కారణం అవుతుంది. పొట్ట సంబంధిత వ్యాధులు క్రోనిక్ వ్యాధులు మరియు సిలియక్ వ్యాధులు, ప్రేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా పెరగడం వల్ల కూడా గ్రేహెయిర్ కు కారణం అవుతుంది.

No comments:

Post a Comment