భూమి లోపలా, పైనా ఉన్న వనరులను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాం. ఇందువల్ల ప్రకృతిలో తూకం తప్పి పర్యావరణ, ఆరోగ్య సంబంధమైన సమస్యలు
అనేకం తలెత్తుతున్నాయని తెలిసినా వనరుల వెలికితీత, దుర్వినియోగం ఆగడం లేదు. అయితే, ఎంత పుష్కలమైన వనరుకైనా ఓ పరిమితి అంటూ ఉంటుంది. అవి అయిపోతే ఏం చేయాలి? మన వనరుల దాహం ఎప్పటికీ తీరనిది కదా. కనుక గ్రహాంతరాలకు సైతం వెళ్లి వనరుల అన్వేఫణ సాగించవలపిందే. అమెరికా ఆ ప్రయత్నంలో ఉండడమే కాదు, తాజాగా ప్రైవేట్ కంపెనీలకు అందులో భాగస్వామ్యం కల్పించడానికి నిర్ణయించింది. చంద్రుడిలోని వనరుల అన్వేషణ దిశగా తొలి అడుగు వేయాలనుకుంటున్న కంపెనీలనుంచి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా దరఖాస్తుల్ని ఆహ్వానించింది. చంద్రుడి ఉపరితలంపైనా, లోపలా వనరుల అన్వేషణ, వెలికితీతలలో తొలి అడుగు ,అందుకు తగిన రోబోలను నిర్మించడమే. ప్రైవేట్ కంపెనీలు ఇందుకు సంబంధించిన కాంట్రాక్టును గెల్చుకోవలసి ఉంటుంది. అయితే, ఈ కంపెనీలకు ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి ఆర్థిక సాయమూ అందదు. నాసా నుంచి మాత్రం వివిధ రూపాల్లో సాయం అందుతుంది. అయితే, వనరుల అన్వేషణలో ప్రైవేట్ కంపెనీలకు పాత్ర కల్పించే విషయంలో ఇంకో ఇబ్బంది ఎదురవుతుంది. అదేమిటంటే, 1967లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఏ ఒక్క దేశమూ చంద్రుడిపై హక్కును స్థాపించుకోలేదు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు చంద్రుడిపై పాత్ర కల్పించడానికి ఈ ఒప్పందం అడ్డు వస్తుంది.ఎలాగంటే, 1967 నాటి ఒప్పందం దేశాల పాత్ర గురించి మాత్రమే చెబుతోంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు పాత్ర కల్పించాలంటే, ఈ ఒప్పందాన్ని తగువిధంగా సవరించుకోవాలి. భూమిలో చాలా అరుదుగా దొరికే లోహాలు, మూలకాలు చంద్రుడిలో ఉన్నాయి. ఉదాహరణకు హీలియం 3. ఇది పర్యావరణ అనుకూల ఇంధనానికి తోడ్పడుతుంది. మొత్తంమీద అమెరికా ప్రయత్నం చంద్రుడి మీద మరో పెట్టుబడిదారీ అమెరికాను సృష్టించడానికే అన్నట్టు ఉంది.

No comments:
Post a Comment