కొందరు గర్భవతిగా ఉన్న సమయంలో మరింత బరువు పెరుగుతారు. మరింతగా
లావెక్కుతారు. దాని వల్ల తల్లికీ, కడుపులోని బిడ్డకూ ప్రమాదం. ఇరువురికీ
ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయి. అంతేకాదు... గర్భవతి కాకముందు లావెక్కడం
సైతం భవిష్యత్తులో కొన్ని సమస్యలు కలిగించవచ్చు. మహిళల్లో స్రవించే కొన్ని
హార్మోన్లు బిడ్డ పుట్టుక అనే అంశంపై ప్రభావం కలిగించవచ్చు.
గర్భవతుల్లో స్థూలకాయం అంటే...
మనం ఉండాల్సిన ఎత్తుకు తగినట్లుగా ఉండాల్సిన బరువు కంటే 30 శాతం అదనంగా
ఉంటే దాన్ని స్థూలకాయంగా పరిగణించవచ్చు గర్భవతులు బరువు పెరగడం సహజమే.
అయితే పెరుగుతున్న కడుపుకు అనుగుణంగా గాక మరింత ఎక్కువగా బరువు పెరుగుతూ
ఉంటే దాన్ని స్థూలకాయంగా పరిగణించాలి పిల్లలు పుట్టే వయసు (ఛైల్డ్ బేరింగ్
ఏజ్)లో ఉండే మహిళల్లో దాదాపు 10 శాతం మంది స్థూలకాయం కలిగి ఉంటారు ప్రసవం
అయ్యాక వారు ఏడాది వ్యవధిలో క్రమంగా బరువు తగ్గుతుంటారు.

No comments:
Post a Comment