సీఫుడ్ అంటే ఇష్టపడే వారికోసం అనేక నాన్ వెజిటేరియన్ రిసిపిలు ఉన్నాయి. అనేక సీఫుడ్ డిష్ లు మిమ్మల్ని టెప్ట్ చేస్తాయి. కొత్త రుచులు చూడాలని
కోరికలను పంచుతాయి. సీఫుడ్స్ లో ముఖ్యంగా చేపల నుండి ప్రాన్స్ వరకూ అన్నీఅద్బుత రుచికలిగి ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. సీఫుడ్స్ చాలా రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఉదాహరణకు రొయ్యలు మన శరీర ఆరోగ్యానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు లోఫ్యాట్, లోక్యాలరీలను అందించే హెల్తీ ఫుడ్స్ గా ఉన్నాయి. రొయ్యల వల్ల మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చు మరియు గుండె సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. మరి ఇన్నిగొప్ప ప్రయోజనాలున్న వీటిని మన డైట్ లో చేర్చుకోవాలి.
కావల్సిన పదార్థాలు: యిల్డ్ రైస్: 2cups రొయ్యలు: 250grms క్యారెట్స్: 3-4(సన్నగా కట్ చేసుకోవాలి) బీన్స్: 6-7(సన్నగా కట్ చేసుకోవాలి) క్యాప్సికమ్: 1(సన్నగా కట్ చేసుకోవాలి) స్పింగ్ ఆనియన్స్: 2(సన్నగా కట్ చేసుకోవాలి) బ్లాక్ పెప్పర్: 4-5(పొడి చేసుకోవాలి) ఉప్పు : రుచికి సరిపడా నూనెం 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా రొయ్యలకు శుభ్రంగా కడిగి, నిమ్మరసం మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 25-30నిముషాలు వేయించుకోవాలి.
2. తర్వాత ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి, వేడయ్యాక అందులో 7-8నిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మరో నిముషం వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే క్యారెట్, బీన్స్ మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా వేయించాలి.
5. వెజిటేబుల్స్ 5నిముషాలు వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు చిలకరించి తర్వాత పెప్పర్ కార్న్ పౌడర్ కూడా చిలకరించి ఒక నిముషం వేగించి తర్వాత ముందుగా ఫ్రై చేసుకొన్న రొయ్యలను కూడా వేసి వేయించుకోవాలి.
6. ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం కూడా వేసి అన్నింటిని బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి.
7. మొత్తం మిశ్రమాన్ని మరో 5నిముషాలు వేయించుకొని స్టౌ ఆఫ్ చేయాలి. అంతే తినడానికి రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా వడ్డిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

No comments:
Post a Comment