భారతదేశంలో గర్భిణీ స్త్రీల కోసం బేబీ షవర్ (శ్రీమంతం)అనేది ఒక సాంప్రదాయ
ఆచారంగా ఉన్నది. సంప్రదాయ ఫంక్షన్స్ చాలా జరుగుతాయి. అప్పుడు సెలబ్రేషన్
మూడ్ ఉంటుంది. అంతేకాక ఆచారాలు అత్యంత సన్నిహితంగా మరియు శ్రేయస్సుకు
సంబంధం కలిగి ఉంటాయి. ఇది గర్భిణీ స్త్రీలు సంతోషంగా ఉండటానికి మరియు
ప్రత్యేక అనుభూతి పొందటానికి సహాయం చేస్తుంది. ఈ కార్యక్రమంలో గాజుల వేడుక
ముఖ్యమైనదిగా భావిస్తారు. మీరు కూడా మీ జీవితంలో ఈ అనుభవం పొందే ఉంటారు.
ఇప్పుడు మీ కోసం ఆశ్చర్యకరమైన వార్త ఒకటి ఉంది.
ఒక కొత్త అధ్యయనం ప్రకారం గర్భవతులు గాజులు ధరించే సంప్రదాయం వలన డెలివరీ
సులభతరం చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ వేడుకను శ్రీమంతం అని
పిలుస్తారు. తల్లిదండ్రులు ఒకటి లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలను
ఆహ్వానించి వారిచే గర్భిణీ స్త్రీలకు ఒక జత గాజులను చేతికి వేయిస్తారు.
గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అనేక ఇతర సంప్రదాయ కార్యకలాపాలు ఉంటాయి.
వీటిలో కొన్నింటికి శాస్త్రీయ వివరణలు ఉన్నాయి. అయితే కొన్ని అపోహలు కూడా
ఉన్నాయి.
గాజులు ధరించుట వలన డెలివరీ సులభం అవుతుందా?
ADVERTISEMENT
మీరు గర్భవతి అయిన తర్వాత డెలివరీ సులభం చేసేందుకు చిట్కాల కొరకు మీ తదుపరి
శోధన ఉంటుంది. ఇక్కడ కొన్ని సాధారణ ఆచారాలు మరియు దానికి శాస్త్రీయ
కారణాలు ఉన్నాయి. వీటిని డెలివరీ సులభం కొరకు చిట్కాలుగా పరిగణిస్తారు.
గాజుల వేడుక
"గాజులు యొక్క గంట వలే శబ్దాలు బిడ్డ కోసం శబ్ద ప్రకంపనలు అందిస్తాయి.
ఎందుకంటే గాజులను శ్రీమంతం సమయంలో మహిళలకు బహుకరిస్తారు" అని ప్రశాంత్
హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ గీతా హరిప్రియ చెప్పారు. గర్భస్థ శిశువు
ధ్వనికి ఉత్తేజితం అవుతుందని ఋజువైంది. అందువలన గాజులు ధరించుట వలన
డెలివరీ సులభతరం అవుతుంది.
డెలివరీ ప్లేస్
సాదారణంగా చాలా మంది ప్రజలు గాజులు ధరించితే డెలివరీ సులభతరం అవుతుందని
నమ్ముతారు. పుట్టిన ప్రదేశం కూడా గర్భిణీ స్త్రీలకు భారతీయ సంప్రదాయంలో
ముఖ్యపాత్ర కలిగి ఉంది.మొదటి డెలివరీ సమయంలో సాదారణంగా మహిళలు డెలివరీ
గురించి భయం మరియు సులభంగా జరగటానికి ఆమె తల్లిదండ్రులతో ఉండాలని
కోరుకుంటారు. ఇది సులభమైన డెలివరీ కోసం ముఖ్యమైన చిట్కాలలో ఒకటి.
ప్రయాణం ప్రాధాన్యతలు
గర్భిణీ స్త్రీలు మాత్రమే గర్భస్రావం ప్రమాదం నివారించేందుకు ఏడవ లేదా
తొమ్మిదవ నెలలో వారి ఇంటికి వెళతారు. అంతేకాకుండా వారు లైంగిక సంబంధం
నివారించేందుకు తిరిగి డెలివరీ తర్వాత మూడోవ నెలలో వారి అత్తమామల ఇంటికి
వస్తారు.
సంగీతం వినడం
కొన్ని స్టడీస్ సంగీతం అనేది ఒక గర్భవతిలో ఒత్తిడి మరియు నిరాశ తగ్గించే
అద్భుతమైన సామర్ధ్యం కలిగి ఉందని నిరూపించాయి.ఈ గర్భస్థ శిశువు వినే
సామర్థ్యం అభివృద్ధికి సహాయం చేస్తుంది.బయట గురుత్వం వలన గర్భవతి అయిన
స్త్రీకి ముందుగానే లేదా బరువు తక్కువ బిడ్డకు జన్మ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రత్యేక ఆహారం
గర్భిణీ స్త్రీలు కోసం అన్ని పోషకాలు ఉన్న ఆహారం ప్రత్యేకంగా
అందించాలి.మీరు గాజులు ధరించుట వలన డెలివరీ సులభం అని భావిస్తే,అప్పుడు
సమతుల్య ఆహారం కూడా డెలివరీని సులభం చేయవచ్చు. ఈ ఆచార సాంప్రదాయం లేని
మహిళలు,ప్రత్యేక ఆహారంను అనుసరించటం అనేది డెలివరీ సులభం కొరకు ముఖ్యమైన
చిట్కాలలో ఒకటి.
నెయ్యి ఉపయోగించడం
ఒక గర్భవతి అయిన మహిళా ఏడవ నెలలో తన సొంత ఇంటికి వెళ్ళుతూ
ఉన్నప్పుడు,భారతీయ సంప్రదాయం ప్రకారం తను తన భర్త యొక్క ఇంటి నుంచి నెయ్యి
తీసుకువెళ్ళుతుంది. దీని వెనుక కారణం శాస్త్రీయంగా గర్భవతి అయిన సమయంలో
నెయ్యి ఉపయోగించటం వలన కండరాల విశ్రాంతికి సహాయపడుతుంది. ఇది డెలివరీ
సులభతరం చేయటానికి సులభమైన చిట్కాగా ఉంది.
ఫంక్షన్స్ మరియు వేడుకలు
గర్భం సమయంలో మహిళలు,ఆమె తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు
చాలా ప్రత్యేకంగా వేడుకను చేస్తారు. గర్భవతి అయిన స్త్రీని సంతోషంగా మరియు
ప్రశాంతంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మీ భౌతిక మరియు మానసిక ఆరోగ్యం
మరియు మీ మనస్సు రిలాక్స్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది డెలివరీ సులభం
చేసేందుకు ఒక ముఖ్యమైన చిట్కాగా ఉంది.

No comments:
Post a Comment