ఆలూ లేదా పొటాటో మన ఇండియాలో ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా
ఉపయోగిస్తుంటారు. ఆలూతో తయారుచేసే సైడ్ డిష్ లేదా ఇతర ఏ వంటలకు కూడా ఆలూ
లేకుండా వంటలు పూర్తి కావు. సాధారణంగా భారతీయ కుటుంబాలలో అల్పాహారాల్లో
ప్రధానమైన ఆహారం రోటీ మరియు సబ్జీగా ఉన్నాయి.
అయితే ఈ రోటీలకు కానీ, లేదా రైస్ కు కానీ, ఆలూను సైడ్ డిష్ గా అనేక వంటలను
తయారుచేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సీజన్ లో అన్ని రకాల గ్రీన్
వెజిటేబుల్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు, బంగాళదుంపలు కూడా ఉన్నాయి.
కాబట్టి, బంగాళదుంప, గ్రీన్ బీన్స్ కాంబినేషన్ మంచి ఆరోగ్యకరమైన వంట. మరియు
రుచికరమైనది. ఇది డ్రై రిసిపి ఎక్కువ సమయం తీసుకోదు. మరి ఈ రెండింటి
కాంబినేషన్ తో మీకు నచ్చే ఒక వంట..
కావల్సిన పదార్థాలు:
ఆలు: 5-6 (పొట్టు తీసి, శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి)
గ్రీన్ బీన్స్: 10-12 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(తరిగినవి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: ½tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో జీలకర్ర వేసి ఒక
నిముషం వేగించుకవోాలి.
2. తర్వాత అందులోనే కట్ చేసిన పెట్టుకొన్నబంగాళదుంప ముక్కలు వేసి, మీడయం
మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో కట్ చేసిన గ్రీన్ బీన్స్ మరియు గ్రీన్ చిల్లీ ముక్కలు
కూడా వేసి, మిక్స్ చేస్తూ మరో 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో
ఉప్పు మరియు పసుపు కూడా చిలకరించి వేయించాలి.
4. తర్వాత మంట పూర్తిగా తగ్గించి 6-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పాన్ కు
మూత పెట్టి, ఉడికించుకోవాలి. మద్య మద్యలో కలియబెడుతుండాలి.
5. ఆలూ ఉడికే లోపు, బీన్స్ కూడా మెత్తబడుతాయి. తర్వాత అందులో కారం, ధనియాల
పొడి కూడా వేసి, అన్నింటిని మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే డ్రై
అండ్ క్రిస్పీ ఆలూ అండ్ గ్రీన్ బీన్స్ రెడీ. దీన్ని రోటీలకు సైడ్ డిష్ గా
మరియు రైస్ -దాల్ కు సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.

No comments:
Post a Comment