Wednesday, December 4, 2013

సురక్షితంగా&ఆరోగ్యంగా గర్భం పొండానికి 14 చిట్కాలు

మీరు గర్భం ధరించారని తెలిసిన వెంటనే, ఆరోగ్యంకరమైన ప్రెగ్నెన్సీ పొందడానికి గర్భిణీ స్త్రీకి, డాక్టర్లు సురక్షితంగా ఉండాలని సలహాలిస్తుంటారు. ప్రెగ్నెన్సీకి మొదటి రెండు త్రైమాసికం చాలా ప్రమాధకమైనదిగా సూచిస్తారు. అందుకొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాలకు మరియు కొన్ని పనులకు దూరంగా ఉండమని సలహాలిస్తుంటారు. కొంత మంది ఇటువంటి నియామాలు, సలహాలేమి పాటించకపోవడం వల్ల గర్బస్రావం అయ్యే ప్రమాదాలు ఎక్కువ. ఏ సలహాలు పాటించకుండా ప్రతి ఒక్కటి తీసుకోవడం వల్ల ఈ రెండు త్రైమాసికంలో ఎదో ఒక సందర్బంలో మీరు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, మీరు గర్భం ధరించినప్పుడు, ఒక నియమం పాటించకుండా ఏవి పడితే అవి తినడం వల్ల కూడా, గర్భిణీ స్త్రీ యొక్క బరువు అమాంతం పెరిగిపోయి, దానికి తోడు, కడుపులో శిశువు పెరుగుతుండటం వల్ల బరువు మొత్తం మీ పాదాల మీద పడుతుంది. అందువల్ల, కొన్నిపనులు చాలా సులభం, తేలికగా జరగాలంటే మీరు సురక్షింతంగా ఉండటమే మంచి మార్గం. గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే కొన్ని ముఖ్య విషయాలను బోల్డ్ స్కై మీముందు ఉంచుతోంది. వీటిని మీరు ఖచ్చితంగా అనుసరించినట్లైతే మీరు సేఫ్ మరియు హెల్తీ ప్రెగ్నెన్సీని పొందగలరు. మరియు గర్భిణీ స్త్రీ, డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వారి సలహాల ప్రకారం నడుచుకోవల్సి అవసరం గర్భిణీ స్త్రీలకు ఉంటుంది. ఈ సలహాలను క్రమంగా పాటించినట్లైతే గర్భిణీ స్త్రీ యొక్క ప్రెగ్నెన్సీ కాలం చాలా సురక్షితంగా ఉంటుంది.

No comments:

Post a Comment