Sunday, November 24, 2013

పీస్ పులావ్ : బటర్ రిసిపి

అన్ని ఫుడ్స్ ఐటమ్స్ లో కంటే రైస్ ఐటమ్ ఒక రుచికరమైన మరియు అందరికి ఇష్టమైన ఒక అద్భుత ఆహారం. రైస్ ను వివిధ రకాలుగా తయారుచేసి సర్వ్ చేయవచ్చు. మన ఇండియాలో రైస్ తో వివిధ రకాలుగా వెరైటీ వెరైటీ వంటలను వండుతారు. ప్రస్తుత వింటర్ సీజన్ లో గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో పచ్చిబఠానీలు కూడా ఒకటి. పచ్చిబఠానీలను ఉపయోగించి వివిధ రకాల కర్రీస్, గ్రేవీస్ తయారుచేస్తుంటారు. అలాగే రైస్ కాంబినేషన్ లో కూడా తయారుచేస్తారు. మీకు వంట చేయడానికి సమయంలో లేనప్పుడు ఇటువంటి వంటను ప్రయత్నించవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా రెడీ అవుతుంది. మరి ఈ రుచికరమైన పీస్ పులావ్ ఎలా తయారుచేయాలో చూద్దాం...
రుచికరమైన పీస్ పులావ్ : బటర్ రిసిపి బాస్మతి రైస్: 1cup 
పచ్చిబఠానీ: ½cup క్యారెట్ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
 లవంగాలు: 2-3 
ఎండుద్రాక్ష- 5-6 (అవసరం అయితేనే)
 బిర్యానీ ఆకు: 1
 ఉప్పు: రుచికి సరిపడా 
వెన్న: 1tbsp
తయారుచేయు విధానం: 1. ముందుగా బాస్మతి రైస్ ను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో బటర్ వేసి, కరిగించాలి. వెన్న కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు మరియు లవంగాలు వేసి వేగించుకోవాలి. 3. తర్వాత అందులో ముందుగా కడిగ పెట్టుకొన్న బాస్మతి బియ్యం, క్యారెట్ ముక్కలు, మరియు పచ్చిబఠానీలు వేయాలి. మీడియం మంట మీద మరో రెండు మూడు నిముషాలు బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. 4. ఇప్పుడు అందులో ఉప్పు మరియు మిగిలిన పదార్థాలు కూడా వేసి వేగించాలి. ఇప్పుడు అందులో ఎండు ద్రాక్ష కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి. 5. తర్వాత మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. 6. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, 5 నిముషాల తర్వాత మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి . ఈ పీస్ పులావ్ ను బటర్ లేదా కర్రీ లేదా సలాడ్ తో సర్వ్ చేయాలి.



No comments:

Post a Comment