Tuesday, November 12, 2013

పురుషుల షేవింగ్ బెస్ట్ ఆయిల్

కొంతమంది పురుషులకు మార్కెట్ లో కొనుగోలు చేసిన ఆఫ్టర్ షేవ్ లోషన్లు మరియు నూనెలు దురదలు లేదా అలెర్జీలకు కారణం కావచ్చు. దానికి బదులుగా ఏ అలెర్జీ ప్రతిస్పందనలు కలిగించని ఆఫ్టర్ షేవ్ నూనెలను తయారుచేసుకోవచ్చు. మీకు చేరువలో ఉన్న పదార్థాల నుంచి మరియు స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువులతో ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలను సిద్ధం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆల్కహాలిక్ బేస్డ్ ఆఫ్టర్ షేవ్ నూనెలు గడ్డం చేసుకుంటున్న సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో చర్మం వృద్ధి మందగించటం వంటి కారణాలతో సమస్యాత్మకంగా ఉండవచ్చు.
ఒక పరిష్కారం మార్గంగా వారి సొంత ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలను ఎన్నుకోవచ్చు. షేవ్ అయిన తర్వాత చర్మానికి స్వాంతన కలిగించేందుకు అప్లై చేయవచ్చు. ఇంట్లో ఆఫ్టర్ షేవ్ నూనెలు తయారు చేసేటప్పుడు మీరు అలెర్జీ ప్రతిస్పందనలు మరియు అంటురోగాలు తగ్గించడానికి సేంద్రీయ మరియు మూలికా పదార్థాలను ఉపయోగించాలి. ఆఫ్టర్ షేవ్ నూనెలను ఇంట్లో తయారుచేయటానికి కలబంద టీ ట్రీ ఆయిల్, ఆలివ్ నూనె,బే రమ్,దోసకాయ,వోడ్కా మొదలైన వాటిని ప్రముఖంగా ఉపయోగిస్తారు.
ఒకసారి మీరు మీ చర్మ తత్వానికి సరిపోయే పదార్దములను ఉపయోగించి తయారుచేసిన ఆఫ్టర్ షేవ్ నూనెను ఎంచుకోండి. దీనిని మీరు ఒక స్ప్రే సీసా ద్వారా ఉపయోగించవచ్చు. ఒక గాలి చొరబడని స్టోరేజ్ బాక్స్ లో పెట్టి ఒక చల్లని ప్రదేశం లేదా ఒక రిఫ్రిజిరేటర్ లో నిల్వచేయవచ్చు. సేంద్రీయ ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలు వాణిజ్య సంరక్షణకారులు లేకుండా పరిమిత జీవితకాలం ఉంటాయి. అందువల్ల తదనుగుణంగా వాటిని ఉపయోగించేలా మరియు జాగ్రత్తగా వాటిని నిల్వచేయాలి. దీనిని ఉపయోగించేవరకు అనవసరమైన ప్రభావాలను నిరోధించేందుకు చల్లని ప్రదేశంలో ఉంచటం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.

No comments:

Post a Comment