Monday, November 11, 2013

ధనియాలు &ధనియాల పొడిలోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు


ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ పిలుస్తారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితి. వంటింట్లో ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో
ఆరోగ్యాన్ని అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే వాటికి తగువిధంగా వాడటం ముఖ్యం. ఉదాహరణకు పసుపును సౌందర్యసాధనంగా ఉపయోగిస్తారు. అలా మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు.. ఇలా అన్ని ఆరోగ్యానికి ఆసరాఇచ్చేవే. వీటిలో ధనియాలు చేదు,కారం, వగరు రుచులను కలిగి ఉంటుంది. వీటిని వంటింట్లో సాంబారు, చారు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. మంచిరుచితో పాటు, సువాసన కూడా ఉంటుంది. సాంబారు, చారుల్లో సువాసన కోసం కొందరు, ఆరోగ్యం కోసం కొందరు ఉపయోగించే కొత్తిమీర కాయలే ఈ ధనియాలు. అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి. మనదేశంలో పెరిగి ఇతర మసాలా దినుసులతో పాటు ధనియాలు కూడా సంవత్సరం పొడవునా పండిస్తారు. కొత్తిమీర చెట్టునుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండవెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాంశాలున్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ధనియాలు కూడా ఒక గొప్పపోషకాంశాలున్న ఆహారంగా వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ధనియాలను రేటింగ్ సిస్టమ్ లో మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ధనియాల్లో అనేక పోషకాంశాలతో పాటు అద్భుతమైన జబ్బులను నయం చేసి లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు. యూరప్ లో దీన్ని యాంటీ డయాబెటిక్ ప్లాంట్ గా పిలుస్తారు. మరి, ధనియాల వల్ల వీటితో పాటు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది అంశాలను చదవాల్సిందే...


No comments:

Post a Comment