Tuesday, October 15, 2013

చిరంజీవి సినిమాలో నటిస్తా : విష్ణు

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిరంజీవి కెరీర్ లో ఓ ఆణిముత్యం లాంటి సినిమా. తెలుగు సినీ చరిత్రలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే..
మళ్ళీ ఆ సినిమాని రీమేక్‌ చేస్తారనే విషయమై గతంలో ఊహాగానాలు వచ్చాయి. ఓ దశలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని అశ్వనీదత్‌ నిర్మాతగా.. రామ్ చరణ్‌ హీరోగా, శ్రీదేవి కుమార్తె హీరోయిన్‌గా రూపొందిస్తున్నారనే ప్రచారమూ జరిగింది. కానీ.. ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరూ దృవీకరించలేదు. తాజాగా.. ఈ సినిమా గురించి హీరో విష్ణు ప్రస్తావించాడు. ''తన తండ్రి వారసత్వంగా చరణ్‌ ఆ సినిమా చేస్తే ఓకే, లేకపోతే.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని రీమేక్‌ చేయాలని నాకైతే వుంది..'' అని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరిక బయటపెట్టేశాడు. మరి.. ఈ సినిమా రీమేక్ అవుతుందా..? అయితే.. హీరోగా చరణ్ ఉంటాడా..? విష్ణు ఉంటాడా...?? అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

No comments:

Post a Comment