మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్ ఇలా ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ పీపుల్ కోసం, ఆఖరికి గేమింగ్ లవర్స్ కోసం కూడా స్పెషల్ గా ల్యాప్ టాప్స్, ఫోన్స్, టాబ్స్ తయారు చేస్తున్నారు. ఇన్ని వెరైటీల గ్యాడ్జెట్స్ మార్కెట్లో ఉంటే..వాని ఎంపికలో యువత, విద్యార్థులు కొంత అయోమయానికి గురవుతారు. మార్కెట్లో ఎన్నో రకాల ల్యాప్ టాపులు వున్నాయి. ఇందులో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం యువత ప్రత్యేకత కాదు, వారికో స్టైల్ వుంటుంది. వారి అభిరుచి వేరు, అందులో లెటెస్ట్ ప్రాసెసర్ ఉండాలి. సాలిడ్ ఫీచర్స్ ఉండాలి. పైగా లోకాస్ట్ లో దొరకాలి. యాపిల్ మ్యాక్ బుక్స్ యాపిల్ కంపెనీ తయారు చేస్తున్న మ్యాక్ బుక్స్ యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. మ్యాక్ బుక్ AIR 11 AND 13లకు యంగ్ జనరేషన్ లో మంచి క్రేజ్ ఉంది. జస్ట్ 1.72 సెం.మీ. థిక్ నెస్, 1 కేజీ లైట్ వెయిట్ తో ఉండే ఈ ల్యాపీస్ యువతకు క్యాచీగా ఉంటాయి. కాస్ట్ ఎక్కువే అయినా అదిరిపోయే క్లారిటీ, క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. కాబట్టి యూత్ ఈ హైటెక్ గాడ్జెట్స్ ని ఇష్టపడుతున్నారు. మ్యాక్ బుక్ ఎయిర్ 11 కాస్ట్ 67,900 రూపాయలకు, 13 ఇంచ్ బుక్ 74,900 రూపాయలకు దొరకుతోంది. మంచి గిఫ్ట్ వోచర్స్ తో, ఆఫర్లతో యాపిల్ కంపెనీ యూత్ ని ఆకర్షిస్తోంది. అసర్ యాస్పైర్ ఎం5 యూత్ సెలెక్ట్ చేసుకునే మరో అమేజింగ్ ల్యాప్ టాప్ ఇది. అల్యూమినియం యాస్పెక్ట్, బ్యాక్ లిట్ కీబోర్డ్, స్టన్నింగ్ బ్యాటరీ లైఫ్ తో ఎట్రాక్టివ్ గా వుంటుంది. హై ఎండ్ టెక్నాలజీ, పవర్ ఎఫిషియంట్ హాస్వెల్ ప్రొసెసర్ తో లభించే దీని ధర 46,000 రూపాయలు. లెనోవా యోగా 11 ఎస్ ఈ అల్ట్రా బుక్ గురించి మూడు మాటల్లో చెప్పొచ్చు. ఫ్లెక్సిబులిటీ, పోర్టబిలిటీ అండ్ టచ్ ఎబిలిటీ. దీన్ని ల్యాపీగానే కాదు, టాబ్లెట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ధర 49,990 రూపాయలు. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అత్యంత ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. కేవలం కాల్స్ కోసమే కాదు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, యూజ్ ఫుల్ యాప్స్, హాట్ హాట్ గేమ్స్, ఇలా ఏదైనా మొబైల్ తో అనుసంధానమైపోయింది. యాపిల్ ఐఫోన్ 5 ఎస్ అండ్ 5 సీ యాపిల్ కంపెనీ వినూత్న స్మార్ట్ ఫోన్ గా వస్తున్న 5ఎస్, 5సీపై యువతలో మంచి క్రేజ్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీతో ఇవి ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాఫాస్ట్ LTE వైర్ లెస్ కనెక్షన్, 64 బిట్ ఆర్కిటెక్చర్ లాంటి సౌకర్యాలు చాలానే వున్నాయి. వీటిని చాలా తక్కువ ధరలో కూడా అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెప్పడంతో యువత ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. స్యామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 4 స్యామ్ సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. స్యామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 4. హైటెక్ ఎక్విప్ మెంట్, వ్యాల్యుబుల్ కంపోనెంట్స్ తో ఇది అదరగొడుతోంది. టీనేజర్స్ లో దీనిపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీని ధర 35,000 రూపాయలు. హెచ్ టీసీ వన్ ఊహాతీతమైన అల్యూమినియం లుక్ తో అందమైన స్క్రీన్ తో మార్కెట్లోకి వచ్చిన HTC one లో కూడా స్టూడెంట్స్ కు ఉపయోగకరంగా ఉండే ఫీచర్స్ చాలా ఉన్నాయి. క్వాడ్ కోర్ ప్రొసెసర్, 4 మెగా పిక్సెల్ కెమెరా, డ్యూయల్ బీమ్ సౌండ్ స్పీకర్స్, ఆకర్షించే ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు. దీని ధర 35,000 రూపాయలు. సోనీ ఎక్స్ పీరియా జెడ్ వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్ మొబైల్ గా హల్ చల్ చేస్తున్న జపనీస్ క్రియేట్ గ్రేట్ టెక్నాలజీ ఫోన్ సోనీ ఎక్స్ పీరియా జడ్. అద్భుతమైన ఫీచర్స్ తో, 13 ఎంపీ కెమెరాతో ఆకర్షించే విధంగా దీనిని తయారు చేశారు. దీని ధర 30,000 రూపాయలు. స్లిమ్ అండ్ స్లీక్ ట్యాబ్స్.. ఐపాడ్ మినీ యాపిల్ ఐపాడ్ కంటే ఐపాడ్ మినీ మీదే కుర్రకారు క్రేజు ఎక్కువ. ఇంప్రెసివ్ డిజైన్, రెటీనా డిస్ ప్లేతో ఐపాడ్ 7.9 ఇంచ్ స్క్రీన్ అద్భుతమనిపిస్తోంది. మూడున్నర లక్షల యాప్స్ ను ఐపాడ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసింది యాపిల్. ఎడ్యుకేషనల్ కేటగిరీ లో కూడా స్పెషల్ యాప్స్ ఉన్నాయి. వీటి ధర 21,000 రూపాయలు. స్యామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 బిల్ట్ ఇన్ S Penతో క్లాస్ లోనే నోట్స్ రాసుకునే ఫెసిలిటీ ఉంది. ఈ నోట్ లో, బ్రైట్ డిస్ ప్లేతో పాటు మల్టీ టాస్కింగ్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. సైడ్ బై సైడ్ స్క్రీన్ తో రెండు అప్లికేషన్స్ ఒకేసారి మానిటర్ చేయవచ్చు. ఈ నోట్ ధర 28,000 రూపాయలు.

No comments:
Post a Comment