Sunday, October 27, 2013

రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌

రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, టైప్‌ 1 డయాబెటిస్‌,గ్రేవ్స్‌ వంటి వివిధ రకాల జబ్బులలో సాధారణ లక్షణం ఏంటి? ఒకటి కీళ్ళను ప్రభావితం చేస్తే, ఇంకోటి బ్లడ్‌ షుగర్‌ని ప్రభావితం చేస్తుంది. ఒకటి థైరాయిడ్‌ను పెంచేస్తే, ఆఖరుది మెదడును,
వెన్నుపూసను ప్రభావితం చేస్తుంది. జబ్బులెన్నైనా కానీ, వీటిని ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌(స్వయం ప్రతిరక్షక జబ్బులు) అంటారు. రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వ్యాధి అంటే దాదాపు 80 రకాల ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌లు కలిస్తే అవుతుంది. క్యాన్సర్‌, హృద్రోగాల తరవాత స్థానం ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌లదే. రూమటాయిడ్‌ వంటి వాటి బారిన పడే వాళ్ళలో పదింట ఎనిమిది మంది మహిళలే.

ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ అంటే ఏమిటి?
రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ జబ్బులో, శరీరంలో ఉండే తెల్ల రక్త కణాల స్పందన ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్‌ల నుండి ఎప్పటిలానే రక్షించకుండా రోగనిరోధక వ్యవస్థ, శరీరంలో ఆరోగ్యంగా ఉండే టిష్యూల మీద దాడి చేసి నాశనం చేస్తుంది.శరీరంలోని టిష్యూలకు వ్యతిరేకంగా యాంటీ బాడీస్‌ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని యాంటీ ఇమ్యూనిటీ అంటారు.ఏ జబ్బు అయినా శరీరంలోని చాలా ఆర్గాన్స్‌ని ప్రభావితం చేస్తే దాన్ని సిస్టమిక్‌ ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ అంటారు. ఒకవేళ ఒక ఆర్గాన్‌ ప్రభావితం అయితే లేక ఒక టిష్యూ ప్రభావితం అయితే దాన్ని టైప్‌ 1 డయాబెటిస్‌ అంటారు.దీన్ని ఒక లోకలైస్డ్‌ ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ అంటారు. వివిధ ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ ఒక సమూహంగా కుటుంబం లాగా ఏర్పడి ఏ ఆర్గాన్‌ మీదైనా దాడి చేయవచ్చు. అలా చేసినపుడు అసాధారణ పెరుగుదల కానీ, పనితీరులో మార్పులు గానీ, సంభవిస్తాయి.ఇదే విధంగా అలెర్జీలకు కూడా శరీరం ఇదే విధంగా ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వలన వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తుంది.అయితే అలెర్జీస్‌ విషయంలో తేడా ఏంటంటే దుమ్ము వంటి బయటి కారణాలకు శరీరం అతిగా ప్రతిస్పందిస్తుంది. మొత్తం మీద ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ అంటే శరీరం దానికదే ప్రతిస్పందించడం.
ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ కు కారణాలేంటి?
బాక్టీరియా,వైరస్‌ వంటి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్‌ లేక కొన్ని మందులు ఈ విధమైన మార్పులకు కారణం కావచ్చు.ఇంకా ముఖ్యంగా కొంతమందికి జీన్స్‌ కూడా ఈ ఆటో ఇమ్యైన్‌ డిసీజెస్‌ రావడానికి కారణం కావచ్చు.
దీన్ని ఎలా తిప్పి కొట్టవచ్చు?
మీకు గనుక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ ఉంది అని అనుమానం వస్తే,దాన్ని ఆపేయడానికి లేదా తిప్పికొట్టడానికి, ముందుగా జబ్బు లక్షణాలను గుర్తించండి తరవాత దాన్ని బట్టి చికిత్స చేయించండి.సాధారణ వైద్యులు కేవలం జబ్బు లక్షణాలకు మందిస్తారు కానీ, అది ఎందువలన వచ్చిందో లోపలి కారణం వెతకరు.నెమ్ముకు కారణం అయే ఆహారాన్ని ముందుగా ప్రక్కకు పెట్టేయాలి.ఆహారంలో గింజ ధాన్యాలను, బీన్స్‌,వేరుశనగ వంటి కార్బో హైడ్రేట్స్‌,ప్రొటీన్‌లు అందించే వాటిని తినకూడదు.ఇవి రోగాన్ని మరింత పెంచుతాయి.సమగ్రంగా మల పరీక్షలను చేయించడం ద్వారా మంచి బాక్టీరియా స్థాయిని తెలుసుకోవాలి.ఏవైనా ఇన్ఫెక్షన్స్‌ గానీ ఉన్నాయా,గట్స్‌ లీకేజ్‌ ఉందా అన్నది కనుక్కోవాలి.80 శాతం కన్నా ఎక్కువ నిరోధక శక్తి గట్స్‌లో ఉంటుంది. ఒకవేళ మీకు గానీ, ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ కనుక ఉంటే తప్పక గట్స్‌ లీకేజ్‌ ఉన్నట్టే. దాన్ని కనుక బాగు చేయకపోతే మీ పరిస్థితిని చక్కబరచలేరు.
ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌కు 10 లక్షణాలు
1. జాయింట్‌ పెయిన్స్‌,కండరాల నొప్పులు,బలహీనత లేక వణుకు
2.బరువు తగ్గడం,నిద్ర పట్టకపోవడం,వేడి తట్టుకోలేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం
3.దద్దుర్లు రావడం,ఎండ తట్టుకోలేకపోవడం,ముక్కు చుట్టుపక్కల ప్రదేశాలలో,బుగ్గలపై సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు రావడం.
4.ఏకాగ్రత లోపించడం
5.అలసి పోయినట్టుగా అనిపించడం,బరువు పెరగడం,లేక చల్లటి పదార్ధాలంటే పడక పోవడం
6.జుట్టు ఊడిపోవడం,శరీరంపై,లేక నోటి లోపల తెల్లటి మచ్చలు ఏర్పడటం
7.కడుపులో నొప్పి,విరేచనంలో రక్తం పడటం లేదా వాంతులవడం లేక నోటి అల్సర్‌లు
8.కళ్ళు,నోరు,చర్మం పొడిబారి పోవడం
9.ఎక్కువ సార్లు అబార్షన్‌లు అవడం,లేక రక్త గడ్డకట్టడం.

No comments:

Post a Comment