Monday, September 16, 2013

'ఐఫా'లో సింగర్స్ అవార్డులపై విమర్శలు..?

టాలీవుడ్ సంగీత ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన గాయకుడు 'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం'. ఆయన పాటకు తెలుగు ప్రేక్షకులే కాకుండా.. ఇతర ఇండస్ట్రీల వారు కూడా ఫిదా అయిపోతారు. బాలు పాటలో అంతా మాదుర్యం ఉంటుంది. రీసెంట్ గా 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో 'జరుగుతున్నదీ.. జగన్నాటకం..' అనే పాటతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇక తెలుగు రాకపోయినా చాలామంది ఇతర భాషల గాయకులు తెలుగులోనూ పాడుతూ.. అలరిస్తున్నారు. వీరిలో బాలీవుడ్ నుంచి వచ్చిన 'శంకర్ మహదేవన్', 'అద్నాన్ సమీ' ప్రముఖలుగా చెప్పుకోవచ్చు. వీరితో పాటు సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న 'థమన్' కూడా సింగరే. 'బిజినెస్ మేన్' సినిమాలోని 'సారొత్తారొత్తారే..రొత్తారొత్తారనే' సాంగ్ తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం జరుగుతున్న 'ఐఫా' అవార్డుల్లో ఈ నలుగురు గాయకుల పాటలూ నామినేట్ అయ్యాయి. అయితే నిర్వాహకులు మాత్రం థమన్ కు 'ఉత్తమ గాయకుడి అవార్డ్' ఇచ్చారు. ఇది చాలా విమర్శలకు తావిస్తోంది. సంగీత ప్రమాణాలకు అనుగుణంగా ఇచ్చే అవార్డును, వ్యక్తిగత అంశాలతో ఇచ్చినట్టు కనిపిస్తోందంటూ చాలామంది సంగీత ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే బాగుండేదని సినీ విమర్శకుల వాదన.

No comments:

Post a Comment