సోనీ కంపెనీ గేమింగ్ లవర్స్ కు రెండు సూపర్ గేమింగ్ కన్సోల్స్ ను
ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇందులో ఒకటి సర్ ప్రైజింగ్ న్యూ వైర్ లెస్ గేమింగ్
కన్సోల్. దీనిపేరు సోనీ ప్లే స్టేషన్ విటా. 60ఎంఎం బై 100 ఎంఎం సైజు ఉన్న ఈ
కన్సోల్ ను ప్లే స్టేషన్ కు వైర్ లెస్ గా, టీవీ లేదా ఇతర ఏదైనా
ప్రొజెక్టర్ కు హెచ్ డిఎంఐ పోర్టుతో కనెక్టు చేసుకోవచ్చు. దీనికి యుఎస్ బి
పోర్టుతో పాటు మెమరీ కార్డ్ స్లాట్ ఫెసిలిటీ కూడా ఉంది. బేసికల్ గా ఈ విటా
టీవీ ద్వారా విటా గేమ్స్ అన్నీ వైర్ లెస్ గా టీవీకి కనెక్టు అవుతాయి.
పిఎస్4 లాంచ్ అయిన తర్వాత ఆ గేమ్స్ కూడా టీవీకి వైర్ లెస్ కనెక్టు అవుతాయి.
ఇక అప్పుడు వేరే గదిలో ఉన్న ప్రోజెక్టర్ తో కూడా ఇది వైర్ లెస్ గా
స్ట్రీమ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్ లో దీని ధర 100 డాలర్లు. ఇక సోనీ
లాంచ్ చేస్తున్న మరో కన్సోల్ ప్లే స్టేషన్ విటాను మరో మానిటర్, టీవీ,
ప్రొజెక్టర్ కనెక్టు చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే దీనికి స్పెషల్ స్క్రీన్
వుంటుంది. అప్ గ్రేడ్ వెర్షన్ వల్ల మరింత స్లిమ్ గా తయారవుతోంది. 15 ఎంఎం
మందంతో, 219 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. సోనీ బాటరీ లైఫ్ ను కూడా 5 గంటల
నుంచి 6 గంటలకు పెంచింది. ఈ డివైస్ మార్కెట్లో విభిన్న కలర్స్ లో
లభించనుంది. కాని ఇది మార్కెట్లోకి రావాలంటే ఈ సంవత్సరం చివరి వరకూ
ఆగాల్సిందే.
యాక్చువల్ ప్రొజెక్టర్స్
యాక్చువల్ గా ప్రొజెక్టర్స్ అంటే ఆఫీస్ ఉపయోగానికో, కమర్షియల్ ప్రజెంటేషన్ కోసమో వాడతారని చాలామంది అనుకుంటారు. కానీ దీన్ని చాలా తక్కువ ధరలో హోమ్ థియేటర్ గా కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? మల్టీప్లెక్స్ లో 3డి మూవీ చూస్తున్న ఫీలింగ్ ఈ ప్రాజెక్టర్లతో వస్తుందంటే మీరు నమ్మగలరా? తక్కువ ధరలో మన డైలీ డిజిటల్ లైఫ్ కోసం కొత్త రకం ఎల్ ఈడి ప్రొజెక్టర్లు వస్తున్నాయి. వాటిలో లక్సిన్ డిఎల్పీ సి5 ఎల్ఈడి ఒకటి. ఫుల్ హెచ్ డి వీడియోలను ప్రొజెక్టు చేసే వీటిల్లో డిఎల్ పి సి5 ఎల్ఈడి ప్రొజెక్టర్ 720 పిక్సెల్స్ వీడియో డిస్ ప్లేతో లభిస్తోంది. ఇన్ బిల్ట్ టీవీ ట్యూనర్ తో వచ్చే సి5 ప్రొజెక్ట్ చేసే వీడియోలు 500 ల్యూమెన్స్ బ్రైట్ నెస్, 2000:1 కాంట్రాస్ట్ రేషియోను కలిగి ఉంటాయి. దీంతో టీవీ ప్రోగామ్స్ థియేటర్లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. యుఎస్ బి కేబుల్, హెచ్ డిఎంఐ పోర్టు ఫెసిలిటీలతో ఇతర డివైజ్ లలో వీడియోలు కూడా ప్లే చేసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ ను కంప్యూటర్, బ్లూ రే ప్లేయర్ లకు కూడా కనెక్టు చేసుకోవచ్చు. దీంతో ఇంట్లోనే 3డి మూవీ చూడొచ్చు. స్క్రీన్ సైజు 10 అంగుళాల నుండి 200 అంగుళాల వరకు ప్రొజెక్టు చేసుకోవచ్చు. 1280 బై 800ఎక్స్ ఎక్స్ జిఎ రిజల్యూషన్ తో ఆ వీడియోలు కనిపిస్తాయి. లక్సీన్ రూపొందించిన కొన్ని ప్రొజెక్టులు ఫుల్ హెచ్ డి ఫీచర్ కలిగి వున్నాయి. అయితే సి 5 ధర 35,000 రూపాయలు.
మ్యో గెస్చర్ కంట్రోల్
ఇకపై ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ను ఆపరేట్ చేయడానికి బటన్స్, కీబోర్డు, రిమోట్ కంట్రోల్ అవసరం లేదు. జస్ట్ మీ హ్యాండ్ మూమెంట్స్ ద్వారా మానిటర్ చేయవచ్చు. చేతికి ధరించే మ్యో గెస్చర్ కంట్రోల్ ఆర్మ్ బ్యాండ్ తో కంప్యూటర్, టీవీ, ఫోన్ ఇలా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ నైనా సరే వైర్ లెస్ గా ఆపరేట్ చేసే వీలుంటుంది. ఈ బ్యాండ్ మీ మజిల్ మూమెంట్స్ డైరెక్షన్ తో పనిచేస్తుంది. దీనిద్వారా రిమోట్ కంట్రోల్ టాయ్స్ దగ్గర నుండి ఆఫీసులో స్లయిడ్ షో ప్రజంటేషన్ వరకూ అన్నింటిని కంట్రోల్ చేయవచ్చు. దీని ధర 150 డాలర్లు. మార్కెట్ లోకి వచ్చేది మాత్రం వచ్చే సంవత్సరం అయినా ఇప్పటి నుంచే ఉచిత ఆర్డర్ చేసుకోవచ్చు.
డిస్నీ ప్లెయిన్స్ గేమ్
డిస్నీ ప్లెయిన్స్ అని ఓ సినిమా వీడియో గేమ్ గా కూడా వచ్చేసింది. డిస్నీ ఇలాంటి గేమ్స్ రూపొందించడం ఇప్పుడేం కొత్తకాదు. ఇంతకుముందు కార్స్ పేరుతో ఓ గేమ్ తో పిల్లలు బాగా ఎంజాయ్ చేయడంతో ఇప్పుడు ప్లెయిన్స్ గేమ్ ను తయారు చేసింది. ప్లెయిన్స్ సినిమాలో మాదిరి ఫెలో క్యారెక్టర్స్, ఇషానీ, ఎకో, బ్రేవోలు మీ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అయితే ఈ గేమ్ ఆడాలంటే డబ్ల్యుఐఐ, డబ్ల్యుఐఐయూ, నిన్టెండో డీఎస్, నిన్టెండో 3 డీఎస్ గేమింగ్ ఫ్లాట్ ఫారమ్స్ మీదనే ఆడడం సాధ్యమవుతుంది. సినిమాలో ఉండే టెన్ క్యారెక్టర్స్ ఈ గేములోనూ ఉంటాయి. ఆ ఫ్లయిట్ ఎగిరేటప్పుడు మీ గేమింగ్ కన్సోల్ రిమోట్ తో మీరు మిషన్ ఆపరేట్ చేసి ఈ గేమ్ ఆడాల్సి వుంటుంది. ఈ గేమ్ ఇప్పుడు పిల్లల్నే కాదు, పెద్దల్ని కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.
ఏ 8 ఎయిర్ ప్లే వైర్ లెస్ స్పీకర్స్
బి అండ్ ఓ ప్లే అనే కంపెనీ తయారు చేసిన ఈ వెరైటీ స్పీకర్ల పేరు ఎ8 ఎయిర్ ప్లే వైర్ లెస్ స్పీకర్స్. మోస్ట్ పాపులర్ స్టయిల్ తో పాటు ఎయిర్ ప్లే వైర్ లెస్ స్టీమింగ్ స్పీకర్లను తయారు చేసింది. ఇంప్రెసివ్ రేంజ్, మల్టిఫుల్ సెట్టింగ్స్ వీటి స్పెషాలిటీ. ఈ స్టీక్ అండ్ స్టయిలిష్ స్పీకర్లను వాల్ కు అటాచ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ వెడల్పు 26 అంగుళాలు, ఎత్తు 9 అంగుళాలు. ఐఫోన్, ఐపాడ్ ల కోసం అడ్జెస్టబుల్ డాక్స్ కూడా ఇందులో వున్నాయి. 105 వాట్స్ అవుట్ పుట్, రిమోట్ కంట్రోల్, వాల్ బ్రాకెట్, లాన్ కేబుల్ ఈ స్పీకర్ ఫీచర్లు.
స్యామ్ సంగ్ నుంచి స్మార్ట్ టీవీలు
దసరా, దీపావళి పండుగలు దగ్గర్లో ఉండడంతో ఈ వారం నుంచే హోమ్ అప్లయెన్సెస్ హవా మొదలైంది. స్యామ్ సంగ్ ఈ ఏడాది పోయిన సంవత్సరం కంటే 40 శాతం ఎక్కువగా మూడున్నర కోట్ల రూపాయల ఎక్కువ సేల్స్ సాధిస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే ఈ కంపెనీ కాస్ట్ లీ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. 66 అంగుళాలు, 55 అంగుళాల ఫుల్ హెచ్ డి స్క్రీన్లతో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. 55 అంగుళాల టీవీ ధర 3.24 లక్షల రూపాయలు, 65 అంగుళాల టీవీ ధర 4.35 లక్షలు. లేటెస్ట్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ డెవలప్ మెంట్స్ ను అటాచ్ చేసుకునేలా ఈ టీవీలను అప్ గ్రేడ్ కిట్ తో అందిస్తోంది స్యామ్ సంగ్. టీవీలకు ఇలాంటి ఇన్నోవేటివ్ కిట్స్ అందించడం ఇదే తొలిసారని ఈ కంపెనీ చెబుతోంది.
సలోరా స్మార్ట్ ఎల్ఈడి టీవీ
ఈ వారం మార్కెట్లోకి వచ్చిన మరో టీవీ సలోరా స్మార్ట్ ఎల్ఈడి టీవీ. ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేసే ఈ టీవీ 1920 x 1080 pixelsతో 50 అంగుళాల డిస్ ప్లేను కలిగి వుంది. ఈ టీవీ ఆన్ లో ఉన్నప్పుడు 85 నుండి 100 వాట్స్ పవర్ ను మాత్రమే ఉపయోగించుకుంటుంది. అదే స్టాండ్ బై మోడ్ లో ఉన్నప్పుడు కేవలం 1 వాట్ పవర్ ను మాత్రమే ఉపయోగించుకుంటుంది. WiFi, dual HDMI inputs, VGA and USB పోర్టులతో పాటు మల్టీమీడియా ప్లేబాక్ సపోర్టు కూడా ఇందులో ఉంది. స్విగెల్ గ్లాస్ బేస్ బాడీతో చూడడానికి చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. డ్యుయల్ 8 వాట్స్ స్పీకర్స్ తో సాలిడ్ సౌండ్ ను ఎంజాయ్ చేయవచ్చు. దీని ధర 64,999 రూపాయలు.
ఒలంపస్ కెమెరా
జపాన్ కు చెందిన ఒలంపస్ అనే కంపెనీ OM-D EM-1 పేరుతో ఒక వెరైటీ కెమెరాని లాంచ్ చేసింది. డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ప్రీజర్ ప్రూఫ్ ఇలాంటి అల్టిమేట్ ఫీచర్లతో ఈ కెమెరా పనిచేస్తుంది. ఇంటర్ ఛేంజబుల్ లెన్స్, 16.3 మెగా పిక్సెల్ సెన్సార్, హై రెజల్యూషన్, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్, 10fps కంటిన్యూయస్ షూటింగ్ ప్రాసెసర్ ఈ కెమెరాలోని స్పెషల్ ఎట్రాక్షన్స్. ఈ కెమెరాలో స్పెషల్ గా మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ ట్రా ఫంక్షనింగ్ కోసం EM-5అనే అడిషనల్ బటన్ ను ఇందుకోసం ఫిక్స్ చేశారు.

No comments:
Post a Comment