Monday, August 5, 2013

అటెండెన్స్ లో సోనియా, రాహుల్‌ ఫెయిల్‌!

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ హాజరు లో ఫెయిల్‌ అయ్యారు. కనీసం యాభై శాతం అటెండెన్స్ కూడా వీరికి లేదు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి
- వృద్ధతరం నేత అద్వానీ మాత్రం అటెండెన్స్ లో ఈతరం నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది నిజమేనండి. పార్లమెంట్‌ సభ్యుల అటెండెన్స్ వివరాలను లోక్‌సభ వెబ్‌సైట్‌లో పెట్టారు. విద్యార్థులు పై తరగతికి ప్రమోట్‌ కావాలన్నా, ఫైనల్‌ పరీక్షలకు కూర్చోవాలన్నా కనీసం 75శాతం హాజరు తప్పనిసరి. ఆరోగ్యసంబంధ సమస్యలున్నప్పుడు ఓ పది శాతం వరకు మినహాయింపు వుంటుంది. ఎలిమెంటరీ స్కూల్‌ స్థాయిలో కూడా హాజరు శాతం సంతృప్తికరంగా వుంటేనే పాస్‌ అవుతారు. అటెండెన్స్ ఫుల్‌గా వున్నవారిని గుడ్‌ స్టూడెంట్స్ లెక్కేస్తుంటారు. అయితే, మన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాత్రం గుడ్‌ అనిపించుకోలేకపోతున్నారు. బ్యాడ్‌ స్టూడెంట్స్ కేటగిరిలో చేరిపోయారు. అవును. ఇది నిజమేనండి. పార్లమెంట్‌ సభ్యుల అటెండెన్స్ వివరాలను లోక్‌సభ వెబ్‌సైట్‌లో పెట్టారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి 48శాతం అటెండెన్స్ మాత్రమే వచ్చింది. అంటే కనీసం సగం రోజులు కూడా ఆమె పార్లమెంట్‌కు హాజరుకాలేదన్న మాట. ఇక ఆమె పుత్రరత్నం రాహుల్‌గాంధీ అటెండెన్స్ ఇంకా ఘోరంగా వుంది. ఆయనకు 43 శాతం హాజరే వుంది. 2009 నుంచి ఇప్పటి వరకు 314 రోజులు సభ జరిగితే, రాహుల్‌గాంధీ 135 రోజులే హాజరయ్యారు. అదే ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థి ఎవరికైనా ఇంత తక్కువ అటెండెన్స్ వుంటే ఎప్పుడో టీసీ ఇచ్చి పంపించేసివారేమో. సోనియాగాంధీ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అమెరికా వెళ్లి శస్త్ర చికిత్స కూడా చేయించుకుని వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి బయటకు రావడం లేదు. బహుశా ఈ కారణం వల్ల ఆమె అటెండెన్స్ తగ్గి వుండవచ్చు. కానీ, తన పార్టీ ఎంపీలందరికీ ఆదర్శంగా వుండాల్సిన యువనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు హాజరయ్యే విషయంలో ఎందుకు అశ్రద్ధగా వుంటున్నారో...? 120 మంది ఎంపిలు మాత్రం 90 శాతానికి మించి అటెండెన్స్ సాధించారు. ఎన్‌సీపీ ఎంపీ, శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియ సులే 87 శాతం హాజరు సాధించి, శభాష్‌ అనిపించుకున్నారు. మేనకాగాంధీ కుమారుడు, బీజేపీ ఎంపి వరుణ్‌గాంధీ 65 శాతం అటెండెన్స్ తో ఫర్వాలేదనిపించుకున్నారు. ఎప్పుడూ కునుకుతీసే వ్యక్తిగా పేరొందిన మాజీ ప్రధాని దేవగౌడ‌ 66శాతం అటెండెన్స్ సాధించారు. ఇక ఆర్‌జేడీ ఎంపి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 79 శాతం, జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ 83శాతం, ములాయంసింగ్‌ యాదవ్‌ 86శాతం అటెండెన్స్ సాధించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ 80 శాతం, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ82 శాతం అటెండెన్స్ సాధించడం విశేషం. 

No comments:

Post a Comment