మనలో చాలా మంది అప్పుడప్పుడు ఉన్నపలంగా ఆనారోగ్యపాలవుతుంటారు. ముఖ్యంగా ఉన్నట్లుండి నొప్పులు మరియు నొప్పి యొక్క లక్షణాలు శరీరంలో మొదలవుతుంటాయి. ఇవి ప్రతి ఒక్కరికీ సర్వ సాధరణంగా ఉంటాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం అవి ఎందుకు వస్తుంటాయో తెలియదు. మనకు తెలియకుండా, మరియు మనం కనిపెట్టలేనటువంటి లక్షణాలు ఏవైనా మనలో కనిపించినప్పుడు ఏ మాత్రం విస్మరించకూడదు. ఆరోగ్యపరంగా తలనొప్పి, కీళ్ళనొప్పులు, బాడీపెయిన్స్ అనేటివి సాధారణంగా వచ్చినా కూడా, కొన్ని ఆరోగ్య లక్షణాలను విస్మరించకూడదు. అవి ప్రాణానికి ముప్పు తీసుకొస్తాయి. కాబట్టి అటువంటి వాటిల్లో మన కొన్ని విస్మరించకూడాని ఆరోగ్య లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం...
నివారించలేని కడుపు ఉబ్బరం:
పురుషుల్లో కంటే మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకు కారణం రుతుక్రమం వల్ల అలా జరవచ్చు. కానీ అంతే కంటే ఎక్కువ సార్లు మీరు కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతన్నట్లైతే అందుకు గల కారణాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. తర్వాత పొట్టలో గ్యాస్ ను వదిలించుకోవాలి. కడుపు ఉదర బాగం నొప్పిగా ఉన్నప్పుడు లేదా తినడానికి అసౌకర్యం కలిగించవచ్చు. ఇది ఒక అంతర్లీన స్త్రీ జననేందియ సమస్య కారణంగా కావచ్చు. దీన్ని పరీక్షించవల్సి ఉంటుంది. అందుకు మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

No comments:
Post a Comment