Tuesday, August 13, 2013

'బాలయ్య' సరసన 'అంజలి' ?

టాలీవుడ్ నటుడు 'నందమూరి బాలకృష్ణ' తాజా చిత్రం 'జయసింహ' చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేం 'అంజలి' నటించనుందని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో ప్రధాన
హీరోయిన్ గా'సోనాల్ చౌహాన్' ను ఇప్పటికే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రెండో హీరోయిన్ కోసం ఈ చిత్రంలో నటించాలని కొంతమంది హీరోయిన్లను సంప్రదిస్తే 'నో' అని చెప్పారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో నటించాలని 'కాజల్'ను సంప్రదిస్తే వీలు కాదని చెప్పిందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. రెండో హీరోయిన్ కావడంతోనే నటించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల 'బాలకృష్ణ' నటించిన సినిమాలు పరాజయం కావడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. చివరకు బాలయ్య సరసన నటించేందుకు 'అంజలి' ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఒకవేళ 'అంజలి' నో చెప్పినా ఎక్కువ పారితోషకం ఇచ్చైనా ఒకే చెప్పించాలని అనుకుంటున్నారంట. ఈ సినిమాకు 'బోయపాటి' దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 1955లో 'ఎన్టీరామరావు', 'కాంతారావు' నటించిన 'జయసింహ' చిత్రం పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment