నార్త్ ఇండియాలో ఎక్కువగా చేసుకొనే పనీర్ చెన్నా మసాలా, స్పైసీ మరియు ఒక అద్భుతమైన వెజిటేరియన్ రిసిపి. ఎక్కువ సమయం, మరియు ఎక్కువ మసాలా దినుసుల అవసరం లేకుండా అతి త్వరగా తయారు చేసుకొనే రిసిపి ఇది. వెజిటేరియన్స్ కు అత్యంత ఇష్టంగా తయారు చేసుకొనే వంటకం పనీర్, చెన్నా ఒక అద్భుతమైన కాంబినేషన్. ఈ రెండింటి కాంబినేషన్ లో నోరూరించి ఈ వంటకానికి కొన్ని సాధారణ వంటగది వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది. మరియు ఈ అద్భుత కాబినేషన్ టేస్ట్ రోటీ మరియు పరోటాలకు మంచి కాంబినేషన్ రిసిపి. మరి మీకు ఇష్టమైన ఈ టేస్టీ పనీర్ చెన్నా మసాలను ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
చిక్పీస్(బుడ్డ శెనగలు పెద్దలు): 1cup
పనీర్: 250gms
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరగాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటాలు: 2(చిన్న ముక్కలుగా తరగాలి)
కొత్తిమీర పొడి: 1tsp
పసుపు: ½tsp
జీలకర్ర పొడి: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
గరం మసాలా: ½tsp
కారం: 1tsp
పొడి మామిడి పొడి: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 2tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర: 2tbsp(చిన్న ముక్కలుగా తరగాలి)
తయారుచేయు విధానం: 1. ముందుగా శెనగలు నీళ్ళలో వేసి 5గంటల పాటు నానబెట్టుకోవాలి. 2. 5గంటల తర్వాత నీరు వంపేసి, ప్రెజర్ కుక్కర్ లో వేసి, ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. 3. ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఉడికించిన శెనగలను చల్లారనివ్వాలి. 4. తర్వాత పాన్ లో నూనె వేసి, తర్వాత జీలకర్ర వేసి, చిటపటలాడకా, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. 5. ఉల్లిపాయ ముక్కలను 5-6నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. 6. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2-3నిముషాలు వేగించుకోవాలి. 7. ఇప్పుడు అందులోనే టమోటోలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి, డ్రై మ్యాంగో పౌడర్, పెప్పర్ పౌడర్ వేసి మరో 5-6నిముషాలు వేగించుకోవాలి. 8. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్నశెనగలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. 9. తర్వాత పన్నీర్ క్యూబ్స్, గరం మసాలా, వేసి నిదానంగా మిక్స్ చేస్తూ వేగించాలి. మీడియం మంట మీద ఇలా 5నిముషాల పాటు ఉడికించుకోవాలి. 12. పూర్తిగా మసాలా పొడులతో బాగా మిక్స్ అయ్యి, ఉడికిన శెనగలకు చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పనీర్ చన్నా మసాలా రెడీ. దీన్ని పరోటా లేదా జీరా రైస్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

No comments:
Post a Comment