Friday, August 16, 2013

కిచెన్ నైఫ్ ఉపయోగించడానికి 7 వినూత్న మార్గాలు.!


కత్తితో కూరగాయలు తరగడమే కాదు!ఇలా కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా మన అందరి ఇల్లలోనూ చాకు(కత్తి)ని విరివిగా ఉపయోగిస్తుంటాం. వంట వదిగదిలోని కత్తి, కూరగాయాలు తరగడానికి
మాత్రమే కాదు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది కేవలం పాక కార్యకలాపాలు తీర్చడం మాత్రమే కాదు, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. నిజానికి, వంటగదిలోని చాకుతో వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా సాధారణంగా ఉపయోగిస్తుంటాం . కానీ చాకు(కత్తి)వెజిటేబుల్స్ కట్ చేయడం మాత్రమే కాదు, కత్తిని ఉపయోగించడానికి మరిన్ని వినూత్న మార్గాలున్నాయి. వంటగదిలోని మీ కత్తిని, మీ వంటగదిలో మాత్రమే కాకుండా, వంట గది బయట కూడా ఎలా ఉపయోగించాలో చూద్దాం.. 1. బాటిల్ ఓపెనర్ గా: వంట గదిలో ఉపయోగించే కత్తిని బాటిల్ ఓపెనర్ గా కూడా ఉపయోగించవచ్చు. మెటల్ కాయిల్స్ ను కట్ చేయడానికి ఉపయోగించిచ్చు. ఇది అంత సులభం కావకపోవచ్చు. అయితే అత్యవసరానికి ఇంట్లో ఓపెనర్ లేనప్పుడు దీన్నే బాటిల్ ఓపనర్ గా ఉపయోగించవచ్చు 2. స్క్రూడ్రైవర్ గా ఉపయోగం: సాధారణంగా మన అందరిఇల్లలో ఇటువంటి చిన్న చిన్న పరికరాలు ఉండటం సహజం. కానీ ఇవి, అవసరానికి దొరకవు. కానీ వంటగదిలోని కత్తి మాత్రం వెంటనే దొరుకుతుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా ఉపయోగిస్తాం కాబట్టి. ఏదైనా వస్తువు యొక్క స్క్రూ, బోల్ట్ వంటి వాటిని బిగించడానికి మరియు టైట్ చేయడానికి స్క్రూడ్రైవర్ గా కత్తిని ఉపయోగించవచ్చు . 3. పెన్సిల్ షేపింగ్: కొన్ని సందర్భాల్లో ఇంట్లో పిల్లలు రాసుకొనే పెన్సిల్ షార్పనెస్ తగ్గిపోతుంది. అదే సమయంలో షార్పనర్ పనిచేయకుండా ఉంటే కత్తినే షార్పనర్ గా ఉసయోగించవచ్చు . గతంలో షార్పనర్ అందుబాటులోకి రాకముందు పెన్సిల్స్ ను బ్లేడ్ తో చెక్కే వారు. అదే విధంగా కత్తి సహాయంతో కూడా పెన్సిల్ ను షార్ప్ చేయవచ్చు. అయితే, ఈపని పిల్లలకు అప్పజెప్పకూడదు. ఏదైనా అపాయం జరగవచ్చు. 4. ఓపెన్ ప్యాకెట్స్: బజార్ నుండి తెచ్చిన ఏదైనా ప్యాకెట్స్ మరియు పౌచెస్ ను ఓపెన్ చేయడానికి కత్తెరను ఉపయోగిస్తుంటాం . అవసరానికి కత్తెర అందుబాటులో లేకుంటే వంటగదిలోని కత్తిని ఉపయోగించి ప్యాకెట్స్ ను ఓపెన్ చేయవచ్చు. 5. టేప్ కట్టింగ్: టేప్ ను కట్ చేయడానికి కత్తెరను ఉపయోగిస్తాం. కానీ కత్తెర లేని సమయంలో టేప్ కత్తితో కూడా కట్ చేసయవచ్చు. ఇది కొంచెం హార్డ్ గా అనిపించినా బాగా పనిచేస్తుంది. 6. బిగుసుకుపోయిన విండోలను ఓపెన్ చేయవచ్చు: ఎక్కువ రోజులు తెరవకుండా ఉన్న విండోస్, బాగా బిగుసుకుపోయింటాయి. అటువంటప్పుడు, చాకును విండో జాయింట్స్ లో నిలబెట్టి తోయడం వల్ల విండోస్ తెరుచుకోవచ్చు. 7. గార్డెన్ లో ఎరువును తీయ్యడానికి : గార్డెన్ లో మట్టి త్వడానికి, ఎరువు తియ్యడానికి గడ్డపారలు ఉపయోగిస్తాం. కాని చిన్న చిన్న పాట్స్ లో మట్టిని తియ్యడానికి చాకు ఉపయోగించవచ్చు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా ఉపయోగించే కత్తితో చేయగల అదనపు ప్రయోజనాలు.


No comments:

Post a Comment