
అత్యవసరంగా ఇ-మెయిల్ చూడాలి. నెట్ ఆన్ చేస్తే నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఎంతసేపటికీ మెయిల్ ఓపెన్ కాదు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చిరాగ్గా ఉంటుంది. కోపం వస్తుంది. కంప్యూటర్‌ను ఎత్తి పడేయాలనిపిస్తుంది. అంత ఆవేశం, కోపం అవసరం లేదు. నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకునే మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం...
చాలామంది 'ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరల్' బ్రౌజర్‌ను ఉపయోగిస్తారు. ఇది కంప్యూటర్ స్పీడ్‌ను చాలా వరకు ఉయోగించుకుంటుంది. అందుకే స్లో అవుతుంది. దీని కంటే యూత్ ఫ్రెండ్లీగా ఉండే క్రోమ్, ఒపేరా ఫైర్‌ఫాక్స్ వంటి అనేక బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ బ్రౌజర్ ఉపయోగించినా అందులో యాడ్‌ఆన్స్ పెరిగే కొద్దీ బ్రౌజర్ నెమ్మదిస్తుంది. అందువల్ల మన అవసరానికి ఉపయోగపడే యాడ్‌ఆన్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వెబ్ పేజీలు రోజు రోజుకు అడ్వాన్స్ అవుతున్నకొద్దీ వీటిని లోడ్ చేయడానికి అవసరమైన ప్రక్రియలు కూడా పెరుగుతాయి. ప్రకటనలను, ఇతర అనసవరమైన సమాచారాన్ని తగ్గించే బ్రౌజర్ ఉత్తమం. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో చాలా ఎక్స్‌టెన్షన్లు ఉంటాయి. ఇవి జావాస్క్రిప్ట్, వ్యాపార ప్రకటనలు, ఫ్లాష్, ఇతరాలు. మీకు అవసరమయ్యేవరకూ వాటిని ఈ ఎక్స్‌టెన్షన్లు బ్లాక్ చేస్తాయి. ఇందులో 'యాడ్ బ్లాక్ ప్లస్' అనే యాడ్-ఆన్ కీలకమైంది. మీరు వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు వ్యాపార ప్రకటనలను ఇది దాదాపుగా తొలగిస్తుంది. దీంతో వెబ్‌పేజీలు వేగంగా ఓపెన్ అయ్యే సమయం పెరుగుతుంది. దీంతోపాటు మీరు 'ఫాస్టర్ ఫాక్స్‌లైట్' అనే యాడ్-ఆన్‌ను ప్రయత్నించొచ్చు. దీనివల్ల ఫైర్‌ఫాక్స్ వేగం పెరుగుతుంది. ఇక గూగుల్‌కు చెందిన 'క్రోమ్ బ్రౌజర్'ను పరిశీలిద్దాం. క్రోమ్ చాలా తక్కువ మెమోరీని ఉపయోగిస్తుంది. జావాస్క్రిప్ట్, ఫ్లాష్ అధికంగా ఉన్న వెబ్‌సైట్లకు క్రోమ్ మెరుగైన బ్రౌజర్. బ్రౌజింగ్ వేగంగా పెరిగేందుకు 'ఫాస్టెస్ట్‌క్రోమ్' అనే యాడ్‌ఆన్ ప్రయత్నించండి. మ్యాక్ కంప్యూటర్ వాడేవాళ్లు 'సఫారి' బ్రౌజర్‌తో మరింత వేగంగా బ్రౌజింగ్ చేసు కోవచ్చు.అనవసర యాడ్-ఆన్స్, ఎక్స్‌టెన్షన్లు, ప్లగిన్స్‌ను తొలగించాలిచాలా ప్లగిన్స్, యాడ్-ఆన్స్ సమర్థవంతమైన ఇంటర్నెట్ సర్ఫింగ్ అనుభవాన్నిస్తాయి. కానీ కొన్నిమాత్రం పేజీ లోడ్ అవ డానికి చాలా కష్టపెడతాయి. అందుకని బ్రౌజర్‌లోని అనవసర మైన ప్లగిన్లు, యాడ్-ఆన్‌లను ఆపివేయడం మంచిది. దీనివల్ల మెరుగైన బ్రౌజింగేకాక, డౌన్ లోడింగ్ స్పీడ్ కూడా పెరుగు తుంది. యాడ్-ఆన్స్‌ను ఆపేయాలంటే.... ఫైర్‌ఫాక్స్‌లోని టూల్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. యాడ్-ఆన్స్ కనిపిస్తుంది. ఇక్కడ అనవసరమైన యాడ్-ఆన్స్‌ను, ప్లగిన్స్‌ను ఆపే యండి. మీరు చేసిన మార్పులు అమలు కావాలంటే ఫైర్‌ఫాక్స్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయాలి. గూగుల్ క్రోమ్‌లో యాడ్-ఆన్స్‌ను ఆపేయాలంటే, క్రోమ్‌లో కస్టమైజ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. టూల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్‌టెన్షన్లను, అనవసర ప్లగిన్స్‌ను ఆపేయండి. గూగుల్ క్రోమ్‌ను రీస్టార్ట్ చేస్తే మీరు చేసిన మార్పులు అమలవుతాయి. ఇక ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో యాడ్-ఆన్స్‌ను ఆపాలంటే.. టూల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ మేనేజ్ యాడ్-ఆన్స్ అని ఉంటుంది. అనవసరమైన యాడ్-ఆన్స్‌ను ఆపేసి, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను రీస్టార్ట్ చేయాలి.ఉపయోగించని ట్యాబ్స్‌ను తీసేయాలిఇంటర్నెట్ సర్ఫింగ్ చేసేటప్పుడు ఒకేసారి వివిధ రకాల వెబ్‌పేజీలను వేరే ట్యాబ్‌లలో ఓపెన్ చేస్తాం. అన్నీ ఒకేసారి చూడం కదా ! అందుకే చూడని ట్యాబ్‌లను క్లోజ్ చేయండి. ఇలా ఒకేసారి వివిధరకాల ట్యాబ్‌లను ఓపెన్ చేయడంవల్ల కొన్ని సెకన్లు లేదా నిమిషాల్లో వెబ్ పేజీలు (వార్త వెబ్‌పేజీలు, సామాజిక వెబ్‌సైట్లు దీనికి ఉత్తమమైన ఉదాహరణలు) ఆటోమెటిక్‌గా రీఫ్రెష్ అవుతాయి. దీనికోసం బ్యాండ్‌విడ్త్ వృథా అవుతుంది. అందుకే అనవసరమైన ట్యాబ్‌లను క్లోజ్ చేయాలి. లేకుంటే ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ వీటివల్ల వృథా అయ్యి, నెట్ నెమ్మదిస్తుంది.పరికరం దిశను మార్చండిమీరు ఇంటర్నెట్ కోసం వైర్‌లెస్ మోడెం వాడుతుంటే చుట్టుపక్కల వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్లూ వైర్‌లెస్ మోడెం వాడుతుంటే మీ బ్యాండ్‌విడ్త్‌ను కూడా వాళ్లు వాడుకునే అవకాశముంది. దీనివల్ల మీ నెట్ స్పీడ్ తగ్గుతుంది. మీ బ్యాడ్‌విడ్త్‌ను వేరేవాళ్లు ఎవరైనా వాడుతన్నారనేది చెక్ చేసుకోవాలి. దీనికోసం 'ఎన్‌ఎస్‌ఎస్‌ఐడిఇఆర్' అనే ప్రోగ్రాంను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసి, రన్ చేయాలి. ఇది వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను స్కాన్ చేస్తుంది. మీ సమీపంలోని వారి నెట్‌వర్క్‌లను తెలుపుతుంది. ఒకవేళ మీ మోడెం నుంచి వాళ్లు బ్యాండ్‌విడ్త్ వాడుకుంటుంటే మోడెందిశను మారిస్తే సరి. వీలుంటే లోపలిగదిలోకి మోడెంను తీసుకెళ్తే బయటి వాళ్లకు సిగ్నల్ రాదు.రెండు ఫైర్ వాల్స్ ఉపయోగించరాదుఒకేసారి రెండు ఫైర్ వాల్స్ వాడటంవల్ల వాటి మధ్య అంతరాయం కలుగుతుంది. దీనివల్ల భద్రత సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. వెబ్ పని తీరు కూడా తగ్గుతుంది. మీరు విండోస్ను వాడుతన్నట్లయితే, వేరే ఫైర్ వాల్ ను డౌన్ లోడ్ చేసుకోండి లేదా కొనండి.చిట్కాలుమీ కంప్యూటర్లో 'స్తై వేర్` ఉంటే మీరు ఎన్ని బ్రౌజర్లు మార్చినా నెట్ స్పీడ్ సమస్య పరిష్కారం కాదు.ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి. కొన్ని ప్రోగ్రాములు రన్ అవ్వాలంటే ఇతర ప్రోగ్రాములు అవసరం అవుతాయి. దీని పై మీకు అవగాహనలేకపోతే కంప్యూటర్ నిపుణుల్ని సంప్రదించండి.
ఇంటర్నెట్ పనితీరును మెరుగుపరిచే కోన్ని స్తైవేర్ క్లీనర్స్, ఇతర ప్రోగ్రాములు నెట్లో కనిపిస్తుంటాయి. వీటిలో చాలా వరకు పని చేయవు. అంతేకాదు స్పైవేర్ కూడా ఉంటుంది. కంప్యూటర్ పనితీరును అడుకుంటుంది. ఒక ప్రోగ్రాంను డౌన్ లోడ్ చేసుకునే మంఉదు దాని గురించి నెట్ లో పరిశోధించండి. ప్రోగ్రామ్ సమీక్షకల కోసం విశ్వసనీయమైన వెబ్సైట్లను చూడండి.ఒకసారి ఒకేసారి వైరస్ స్కాన్ చేయండి. బహుళ వైరస్ స్కానింగ్ ప్రోగాములతో (అవాస్ట్, క్యాస్పర్స్కై, ఎవిజి తదితరాలు) స్కానింగ్ చేయడం వల్ల ఇవి ఒకదానికొకటి అంతరాయం కలిగించుకుంటాయి. దీంతో వైరస్ తప్పితోతుంది. స్కానింగ్లో దొరకదు.రెండురోజులకు ఒకసారి వివిధ సమయాల్లో బ్యాండ్ విడ్త్ టెస్ట్ చేయండి. సగటున ఎంత స్పీడ్ వస్తుందో చూడండి.ఇంటర్నెట్ కనెక్షన్ వేగాన్ని పెంచే 'స్పీడ్ బైస్టర్స్`ను డౌన్ లోడ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దు. వీటిలో చాలా వరకు పనిచేయవు. అంతేకాక మీ నెట్ వేగాన్ని వేగాన్ని తగ్గిస్తాయికూడా.
No comments:
Post a Comment