Friday, July 12, 2013

మటన్ షోర్బా హెల్తీ రంజాన్ డిష్


షోర్బా ఇది అరబ్ రిసిపి. ఇది ఒక రకమైనటువంటి మటన్ సూప్. ఇది గల్ఫ్ లో చాలా పాపులర్ అయినటువంటి వంటకం. ఈ అరబ్ వంటకాన్ని మన స్టైల్ లో తయారు చేయబడింది. రంజాన్ మాసంలో ముస్లీంలు దీన్ని తీసుకోవడం హెల్తీగా భావిస్తారు. షోర్భా ప్రథమికంగా మటన్ సూప్. దీన్ని లెబాన్సే బ్రెడ్(కాబూస్)తో తీసుకుంటారు. మనం కూడా ఈ షోర్బాను ఇండియన్ బ్రెడ్ గా పిలుచుకొనే రోటీతో తినవచ్చు. షోర్భా ఫర్ ఫెక్ట్ రంజాన్ రిసిపి. ఎందుకంటే ఇది లైట్ మటన్ సూప్ కాబట్టి. మీ ఉపవాసదీక్షను విరమించడానికి ఈ మటన్ షోర్బాన్ తీసుకోవడం వల్ల ఎటువంటి అజీర్ణ సమస్యలు లేదా ఎసిడిటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ రంజాన్ స్పెషల్ డిష్ ను ఎలా తయారు చేయాలో చూద్దామా...


 కావల్సిన పదార్థాలు: మటన్: 500 గ్రాముల (మధ్యతరహా ముక్కలుగా కట్) లవంగాలు: 5 దాల్చిన చెక్క: చిన్న ముక్క బిర్యానీ ఆకు: ఒకటి ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp టమోటా గుజ్జు: 1/2cup పెప్పర్ పౌడర్: 1tbsp జీలకర్ర పొడి: 1tsp కారం: 1tsp ధనియాల పొడి: 1tsp బాదం పేస్ట్ : 1 / 2 కప్ నూనె: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా కొత్తిమీర: 1/2cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి) నిమ్మకాయ: 2స్లైస్ తయారు చేయు విధానం: 1. ముందుగా డీప్ బాటమ్ పాన్ వేడి చేసి, అందులో లవంగాలు, చెక్క, మరియు బిర్యానీ ఆకు వేసి, 30సెకండ్స్ ఫ్రై చేయాలి. 2. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరయు మటన్ వేయాసి, 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి. మటన్ నుండి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలే సమయంలో అందులో టమోటో గుజ్జును వేయాలి. 3. తర్వాత ఉప్పు, పెప్పర్, పసుపు, కారం, ధనియాల పొడి వీటన్నింటిని వేసి, మరో 2-3నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. 4. ఇప్పుడు అందులో 3కప్పుల నీళ్ళు పోసి, మూత పెట్టి 10-15నిముషాలు ఉడికించుకోవాలి. 5. మటన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో నిమ్మరసం పిండి, కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి, అరబిక్ బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయాలి.


1 comment:

  1. మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
    క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

    ReplyDelete