Thursday, June 20, 2013

మైక్రో ఓవెన్ కొనే ముందు తెలుసుకోవల్సిన కొన్ని విషయాలు


వంటలో సమయాన్ని, ఇంధనాన్ని, ఖర్చును ఆదాచేసే మైక్రోవవ్‌ను ఆధునిక సాధనంగా చెప్పవచ్చు. మైక్రోవేవ్ మీద వంట వండుకోవడమో, లేక మైక్రోవేవ్ మీద వంటను చేసుకుంటే బాగుండును అనుకోవడం తప్ప దాని గురించి మరేమీ తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రయోజనాలు, సాంకేతిక వివరాలు ఇవి. అవసరాన్ని బట్టి కొనాల్సిన వస్తువు ఇది. వాటితో పాటు వంటింట్లో ఉన్న స్థలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. స్థూలంగా మైక్రోవేవ్‌లు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి - తిండిని వేడి చేయడానికి పనికొస్తుంది. రెండు - కేకుల్లాంటివి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మూడు - టిక్కా లాంటి గ్రిల్లింగ్ అవసరమున్న వంటకాలు చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. మీరు ఎంత మొత్తంలో వండుకుంటారో దాన్ని బట్టి సైజును ఎంచుకోవాలి. ఎక్కువమంది ఉన్నప్పుడు పెద్దది తీసుకోవడమే మేలు. చిన్నది తీసుకుంటే వంటకాన్ని విభజించి రెండుమూడుసార్లుగా చేసుకోవాల్సి ఉంటుంది. అదే వంటకు కాకుండా కేవలం వండిన దాన్ని వేడిచేసుకోవడానికి మాత్రమే వాడేవాళ్ళయితే పెద్ద కుటుంబమైనా సరే చిన్న మైక్రోవేవ్ ఒవెన్ కొనుక్కుంటే సరిపోతుంది. మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్‌ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్‌లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. మామూలు ఓవెన్‌‌లో వంట చేసే సమయంలో నాలుగింట ఒక వంతు సమయాన్ని మాత్రమే మైక్రోవేవ్ ఓవెన్‌లు తీసుకుంటాయి. వేడి ఓవెన్‌కు పరిమితమైది. కాబట్టి మీ వంట గదిలో వేడి ఉండదు. వంట మరింత రుచికరంగా ఉంటుంది. దినుసుల్లో సహజరుచి ఏమాత్రం మారదు. తక్కువ సమయంలోనే వంట చేయడం వల్ల అందులోని మూలకాలు, విటమిన్లు, ఇతర పోషకవిలువలు అలానే ఉంటాయి. మైక్రోఓవెన్లు : చిన్నచిన్న పదార్థాలు వేడిచేయడానికి మైక్రో ఓవెన్లు బాగా సహకరిస్తాయి. గ్యాస్‌ఫై వండటానికి అయ్యే సగం ఖర్చుతోనే వీటిలో వంటని కానిచ్చేసుకోవచ్చు. పదార్థాలు వేడి చేయటానికి ముందు పరికరాన్ని వేడి చేయాలేమో అనుకొంటారు చాలామంది. కానీ కేకులు చేయడానికి తప్ప మరే ఇతర వంటకాలకి ముందుగా వేడి చేయాల్సిన అవసరం లేదు. అది వృథా ఖర్చు. ప్రతిసారీ పదార్థాలు వేడక్కాయా లేదా అని పరీక్షిం చడం కోసం ఓవెన్‌ తలుపులని తరచూ తీసి చూడ్డం వల్ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు తగ్గిపోతాయి. తిరిగి వేడేక్కడానికి కొంత సమయం తీసుకుంటుం ది. మైక్రో ఓవెన్‌ ముందుగా బయట ఉండే అంచులు వేడెక్కిన తర్వాత క్రమంగా మధ్యభాగం వేడవుతుంది. అందుకే ఎక్కువ సమయం వేడిచేయాల్సిన పదార్థాలని, మందంగా ఉన్న వంటకాలను అంచుల వద్ద ఉంచి లోపల చిన్న చిన్న పాత్రలు పెట్టాలి. 1. మైక్రోవేవ్ ఓవెన్ లోపల ఉండే రొటేటింగ్ ట్రే నెమ్మదిగా బయటకు తీసి కడగాలి 2. కోలిన్‌, ప్రిల్‌ స్ప్రే వంటి బహుళ ప్రయోజంగా ఉండే లిక్విడ్‌తో ముందు వైపుకు ఉండే అద్దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. 3. క్లీనింగ్‌ ప్యాడ్‌తో లోపల పడిన మరల్ని అద్దేయాలి. 4. మైక్రో ఓవెన్‌ సేఫ్‌ బౌల్‌ లో నీరుపోసి ఉంచాలి. ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తరువాత లోపల పడిన మరకల్ని తుడిస్తే సులువుగా పోతాయి. 5. వండే సామర్ధ్యం ఒక్కోరకానికి ఒక్కోలా ఉంటుంది. మీరు కొన్న రకంలో ఏ తరహా పదార్ధాల్ని వేడిచేయడానికి ఎంత సమయం పడుతుందో చదివి బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ వేడయినవి తింటే నోరు కాలే ప్రమాదముంది. 6. మూత బిగించిన పాత్రల్లో వండొద్దు. వండిన వాటి పైన ఉన్న మూతను తొలగించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మైక్రోవేవ్ ఒవెన్‌ని ఆన్ చేసి ఉన్నప్పుడు దాని మూత తీసే ప్రయత్నం చేయవద్దు. ఒవెన్ మూత గట్టిగా పడకపోయినా, వంగిపోయినా, పాడయినా అది సరయ్యేవరకు మైక్రోవేవ్‌ ని వాడొద్దు. 7. మైక్రోవేవ్ ఒవెన్ పనిచేస్తున్నప్పుడు దానికి దగ్గరగా నిలబడొద్దు. కనీసం మోచేతి దూరంలోనన్నా ఉంచండి. 8. కొన్ని ఒవెన్లను ఖాళీగా ఉన్నప్పుడు ఆన్ చేయకూడదు. అందుకే మీకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ మాన్యూల్‌ ని క్షుణంగా చదివిన తర్వాతే మైక్రోవేవ్ ఒవెన్‌ ని వాడడం మొదలుపెట్టండి. ఒకవేళ పొరపాటున ఖాళీగా ఆన్‌చేసేశారనుకోండి. ఒక గ్లాసుడు నీళ్ళను లోపల పెడితే అవి తరంగాలను గ్రహిస్తాయి. 9. తడి బట్టా, తక్కువ గాఢత ఉన్న డిటర్జెంట్లతో ఒవెన్‌ను శుభ్రం చేయాలి. 10. ద్రవపదార్థాల్ని రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు వేడిచేయకూడదు. వేడి చేసిన తర్వాత కనీసం 30 సెకండ్లు కదపకుండా ఉంచండి. ఆ తర్వాతే బయటకు తీయండి. బాగా వేగించే వంటకాలు మైక్రోవేవ్ ఒవెన్‌లో చేయకూడదు. 11. కొన్ని వంటకాలలో అతిగా ఉడకకుండా ఉండడం కోసం ఆహారపదార్ధాల్ని అల్యూమినియం ఫాయిల్‌ తో కప్పమని సూచిస్తారు. వాటిని తూచా తప్పకుండా పాటించండి. మీ మైక్రోవేవ్ ఒవెన్‌ లో టర్న్ టేబుల్ లేకపోతే మధ్యలో ఒకసారి డిష్‌ ని తిప్పండి. టర్న్ టేబుల్ ఉన్నా సరే మధ్యలో ఒకసారి ఆహారాన్ని కలబెడితే సమంగా ఉడుకుతాయి.

2 comments:

  1. స్టవ్ మీద వండే పధ్ధతిలో పదార్థానికి వేడి బయటినుంచి ఇస్తారు. మరి మైక్రోవేవ్ పధ్ధతిలో పదార్థం లోంచే వేడి పుట్టేలా చేస్తున్నారు. ఈ పధ్ధతి ఆహారం లోని అణువుల అమరికని ప్రభావితం చేయదా? అలా వండిన ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇవి మనసుని తొలిచే కొన్ని ప్రశ్నలు. వీటిగురించి మీవద్ద ఏమైనా సమాచారం ఉందా?

    ReplyDelete
  2. Thanks for the valuable information. A small correction, never use aluminum foil in the microwave, it will catch on fire and could explode. You might mean saran wrap or something similar to cover certain food stuffs, which are Ok to use in microwave oven.

    ReplyDelete