మొటిమల సమస్య బాధిస్తుంటే..తప్పక గుర్తుంచుకోవల్సిన విషయాలు?

సాధారణంగా అన్ని వయస్సుల వారిలో వచ్చే సాధారణ చర్మ సమస్య మొటిమలు, మచ్చలు!ఈ సమస్య కేవలం టీనేజ్ వారికి మాత్రమే పరిమితం కాదు. పెద్దవారిలో కూడా మొటిమలు కలిగి మరియు ముఖం మీద ఒక మచ్చలా ఏర్పడవచ్చు. మొటిమలను గిల్లడం వల్ల చర్మ సమస్యలకు పరిష్కారం కాదు. మొటిమలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, మొటిమల చర్మం మీద నిమ్మరసాన్ని అప్లై చేయడం అనేది, ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. ఇది చాలా చౌకైన మరియు ప్రభావంతమైన ఇంటి చిట్కా. అదే విధంగా మిగిలిన వంటగది వస్తువులు ఉదా: గంథపు పొడి మరియు తేనె, కలబంద మరియు అరటి వంటివి కూడా మొటిమలను నివారించడానికి చికిత్సలో ఉపయోగించేటటువంటి చాలా సమర్థవంతగా ఉంటాయి. కాబట్టి మొటిమల నివారణకు రసాయన ఆధారిత ఖరీదైన ఉప్పత్తుల వాడకం మరియు ఖర్చుతూ కూడిన సెలూన్ల చుట్టూ తిరిగి పర్స్ ఖాళీ చేసుకోవడం కంటే వంటగదిలో ఉండే వస్తువులతో సహజంగా మొటిమలకు చికిత్స అంధించండి. మొటిమలు లేని ముఖం అందాన్ని సొంతం చేసుకోండి. అయితే, కేవలం ఫేస్ ప్యాక్ లు అప్లై చేయడం వల్ల పనిచేయదు. ఇది కేవలం డైట్ వంటిదే. కానీ ప్రయోజనం ఉండదు. అందుకోసం మొటిమలను నివారించాలంటే మీరు కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా అధికంగా మొటిమల చర్మ సమస్యతో బాధపడే మహిళలు కొన్ని విషయాలను మనస్సులో గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు: జుట్టు ముఖం మీద పడటం వల్ల కూడా ముఖంలో మొటిమలు విస్తరించడం జరుగుతుంది . కాబట్టి, తరచూ మొటిమల సమస్యకు గురిఅయ్యే మహిళలు తప్పకుండా గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలున్నాయి...వాటి పరిశీలించండి.. మొటిమల మీద వత్తకూడదు లేదా గిల్లకూడదు: మొటిమలను గిల్లి లోపల ఉన్న పస్ (చీమును)తీసివేయడం మంచిదని బావిస్తే, అది తప్పు ఆలోచన. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు ఏర్పడతాయి మరియు ముఖం మీద ఇతర ప్రదేశాల్లో మొటిమలు వ్యాప్తి చెందుతాయి.
No comments:
Post a Comment