Tuesday, June 18, 2013

అమ్మాయిలంటే ఎందుకంత మమకారం..?

మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల అభిప్రాయాల్లోనూ అనూహ్య మార్పులొస్తున్నాయి. భారత్ వంటి దేశాల్లో ఆడపిల్లలను ఇప్పటికీ ‘గుండెల మీద కుంపట్లు'గానే
భావిస్తుండగా, బ్రిటన్‌లో మాత్రం కూతుళ్ల పెంపకంపైనే దంపతులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మగపిల్లల కంటే ఆడపిల్లలకు దుస్తులు, స్కూల్ యూనిఫాంలు, ఇతర సౌకర్యాలు సమకూర్చేందుకు తల్లిదండ్రులు అధికంగా డబ్బు ఖర్చు చేసేందుకు సుముఖత చూపుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. కుమారుడు ఉన్నప్పటికీ కూతురి దుస్తుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుమార్తెకు మంచి దుస్తులు కొనేందుకు షాపింగ్ చేయడమంటే ఇష్టపడతామని చాలామంది పేరెంట్స్ చెబుతున్నారు. ఏకైక సంతానం కుమార్తె అయితే దుస్తులు, ఇతరత్రా ఎక్కువ మొత్తం ఖర్చు చేసేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే కొత్త దుస్తుల్లో ఎంతో అందంగా, ముద్దొచ్చేలా కనిపిస్తుంటారని 41 శాతం మంది దంపతులు చెప్పడం విశేషం. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక బిడ్డకు తల్లితండ్రులుగా ఉండడం అనేది అద్భుతమైన ప్రయాణం. అయితే, అమ్మాయి అయితే తల్లికి మరింత ఉపయోగం ఎందుకంటే ఆమె వలె పిల్ల కూడా అదే ఆలోచనలతో తోడుగా ఉంటుంది. ఒక కుమార్తెను కలిగిఉ౦డడానికి గల కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి. అమ్మాయి - అమ్మాయి మాట్లాడుకోవడం మీరు మాట్లాడడానికి ఫోను అవసరం లేదు, మీరు మీ స్వంత కూతురుని ఒక అమ్మాయిగా అనుకుని మీ భావాలను పంచుకోవచ్చు. కొన్నిసార్లు పురుషులు చిన్నచిన్న విషయాలను, మాటలను లెక్కచేయరు. కానీ మీకు ఒక అమ్మాయి ఉన్నట్లయితే, మీరు చెప్పే విషయాలు వినడానికి ఆమె చెవి మీ వైపు ఉంటుంది.





No comments:

Post a Comment