Monday, March 18, 2013

చిన్న పిల్లల్లో ఎక్కిళ్ళు తగ్గించేందుకు చక్కటి పరిష్కార మార్గాలు...!

ఎక్కిళ్ళు లేదా వెక్కుళ్ళు(Hiccough) అప్పుడప్పుడు అందరికీ అనుభవమైనవి. ఇవి ఉదరవితానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వలన గాలి ఉఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తూ స్వరతంత్రులను దగ్గరచేస్తుంది. దీని మూలంగా 'హిక్' అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారం చేసుకొనే ఆయుర్వేదంలో వెక్కిళ్ళను 'హిక్క' అని, ఆంగ్లంలో 'హిక్కప్' అని అంటారు. సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వుంటే ఏవరో ఎక్కువగా తలుచుకోవటం వల్ల ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటారు. అయితే ఒక్కోసారి చిన్న పిల్లల్లో వచ్చే ఎక్కిళ్ళు తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తాయి. అయితే చిన్నపిల్లల్లో ఇవి సహజంగా వస్తుంటాయి. అందుకు ఆందోళన పడవల్సిన అవసరం లేదు. అందుకు కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. పసిపిల్లల్లో ఎక్కిళ్ళకు మొదట కారణాలు తెసుకొన్నట్లైతే ఎక్కిళ్ళను పోగొట్టడానికి అతి సులభమైన మార్గాలున్నాయి. పసిపిల్లల్లో ఎక్కిళ్ళకు కారణాలు: ఎక్కిళ్లు డయాఫ్రం కదలిక వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన 'ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డయాప్రం ఒక్కసారిగా సంకోచించడము వలన ... గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో 'హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

1 comment:

  1. అసలు విశయం మర్చిపోయారు. ఎక్కిళ్ళు తగ్గడానికి మార్గాలు చెప్పలేదు మీరు.

    ReplyDelete