
కావలసిన పదర్ధాలు:
పెప్పర్ కార్న్ పపాడ్: 2
క్యారెట్ : 2 పెద్దవి....................
టమోటో: 2చిన్నవిపెప్పర్ కార్న్ పపాడ్: 2
క్యారెట్ : 2 పెద్దవి....................
ఉల్లిపాయ: 1
వేయించిన వేరుశెనగలు: 2tbsp
నిమ్మరసం: 1tbsp
కొత్తిమిర తరుగు: కొద్దిగా
కారం: 1/4tsp
చాట్ మసాలా: 1/4tsp
ఉప్పు : రుచికి సరిపడాతయారు చేయు విధానం:
1. ముందుగా క్యారెట్ ను చివరలు కట్ చేసి మంచినీళ్ళలో బాగా కడిగి పొడి వస్త్రం తుడి తడి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా తురుము కోవాలి.
2. తర్వాత ఉల్లిపాయను, టమోటోను, కొత్తమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమోటో, వేయించిన వేరుశనగపప్పు, కొత్తిమీర, నిమ్మరసం అన్నీ కలుపుకోవాలి.
4. తర్వాత పపాడ్(అప్పలం)ను మైక్రో ఓవెన్ లో ఒక నిమిషం పాటు పెట్టి బేక్ చేసుకోవాలి. తర్వాత పపాడ్ మీద క్యారెట్ మిక్స్ ని లేయర్ గా పరచాలి.
5. తర్వాత క్యారెట్ లేయర్ మీద ఉప్పు, చాట్ మసాలా, కారం, చిలకరించి వేంటేనే సర్వ్ చేయాలి. అంతే పపాడ్ క్యారెట్ చాట్ రెడీ
No comments:
Post a Comment