Monday, April 9, 2012

మటన్ సమోసాను తయారు చేయడం ఎలా!

Samosa
కావలసిన పదార్థాలు :
మటన్ ఖైమా - 200గ్రా,
మైదా - 100గ్రా,.......................ఉల్లిపాయలు - ఒకటి,
అల్లం, ఉల్లి పేస్ట్ - 1/4 టీ స్పూన్,
పచ్చిమిర్చి - రెండు,
ధనియాల పొడి - ఒక టీ స్పూన్,
నూనె - సరిపడినంత,
గరం మసాలా పౌడరు - 1/2 టీ స్పూన్,
కార్న్ - ఒక కప్పు,
ఉప్పు - సరిపడినంత.
తయారీ విధానం : మటన్ ఖైమాలో ఉప్పు, ధనియాల పొడి పసుపు కలిపి బాగా ఉడకబెట్టాలి. నీరు ఇంకిపోయాక కడాయిలో నూనె వేసి కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ముక్కలు కలిపి వేయించుకోవాలి. దీనిలో ఖైమా కలపాలి. కార్న్ గింజల్ని కూడ వేయాలి. ఇంకోవైపు మైదా, ఉప్పు మూడుస్పూన్ల ఆయిల్, నీరు వేసి పిసికి ఉంచాలి.

మైదాపిండితో చిన్న చిన్న ఉండల్ని చేసి పూరీల్లాగా తయారుచేసుకుని దాని మధ్యలో ఖైమా, కార్న్ ఫిల్లింగ్‌ను ఉంచాలి. వాటిని పిరమిడ్ ఆకారంలో ఫోల్డ్ చేసి. తర్వాత నూనెను బాగా వేడిచేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత అందులో మూడు నాలుగు పీసెస్‌ను వేసి, క్రిస్పీగా వచ్చేంతవరకు వాటిని వేయించుకోవాలి. అంతే మటన్ సమోసా రెడీ!.. ఈ మటన్ సమోసాను టమోటా లేదా చిల్లీ సాస్‌తో హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటాయి.

No comments:

Post a Comment