- కావలసిన పదార్థాలు
నూనె - వేయించడానికి సరిపడా.................
తయారు చేసే విధానం
గోధుమపిండిలో ఒక స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లు పోసుకుంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. దీన్ని గిన్నెలో వేసి మూతపెట్టి అరగంట నానబెట్టాలి. జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్క, ఎండుమిర్చి, లవంగాలు వేయించి మెత్తగా మసాలా పొడి చేసుకోవాలి. మినప్పప్పు గంట నానబెట్టి నీళ్లు పొయ్యకుండా మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే నూరుకున్న మసాలా పొడి కలపాలి. బాండీలో 2 స్పూన్ల నూనె వేసి కాగాక మినప్పిండి మిశ్రమాన్ని నీరంతా పోయేలా సన్నమంట మీద వేయించాలి. చపాతీ పిండిని చిన్న వుండలు చేసి ఒక్కోదాన్ని తీసుకుని చేత్తోనే చపాతీలా చెయ్యాలి. మధ్యలో వేయించిన మినప్పిండి మిశ్రమాన్ని పెట్టి మూసెయ్యాలి. దీన్ని పూరీలా వత్తుకుని కాగిన నూనెలో వేయిస్తే చాలు. మసాలా పూరీ రెడీ. వీటిని వేడి వేడిగా టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా వుంటాయి.
No comments:
Post a Comment