Wednesday, January 25, 2012

45 ఏళ్లు వచ్చినా ప్రకాశవంతమైన చర్మంతో యవ్వన కాంతులు...

శీతాకాలంలో చర్మం పొడిబారిపోతుంది. చర్మం నిత్యం కాంతివంతంగా,.............................ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండటానికి కొంతమంది ఏవేవో లోషన్‌లు వాడి బాగున్న చర్మాన్ని కూడా కళా విహీనంగా చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే టీవీలలో, రేడియోలలో వచ్చే ప్రకటలను చూసి, విని, ఇవి వాడితే నిజంగా చర్మం మెరుస్తూ, సౌదర్యంగా ఉంటుందేమోనని భ్రమపడుతున్నారు. ఇలా చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి, విసిగిపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన వారి చర్మంలో ఏమాత్రం మార్పు ఉండదు.

మనదేశంలో చాలామంది చిన్నవయస్సులోనే ముఖం, చర్మం ముడతలుపడి, ముసలి వారిలా కనిపిస్తుంటారు. కారణం... ముఖం, చర్మం ప్రకాశవంతంగా, నునుపుగా ఉండటానికి పలురకాల క్రీమ్‌లు, పౌడర్లను వారు వాడటం వల్ల అలా చర్మానికి ముప్పు తెచ్చుకుంటుంన్నారు. అదేవిధంగా కొందరు స్త్రీలు 45 ఏళ్లు వచ్చినా చర్మం ముడుతలు పడకుండా యవ్వనపు నిగారింపుతో మెరిసిపోతుంటారు. ఆ యవ్వన కాంతుల వెనుక రహస్యం ఏంటంటే...

* ఒక చెంచా నిమ్మరసం,ఒక చెంచా గ్లిసరిన్, ఇంకా ఒక చెంచా రోజ్ వాటర్ తీసుకుని మూడింటిని బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ స్నానానికి అర్థగంట ముందు చర్మానికి రాసుకుని తర్వాత స్నానం చేయాలి. లేదా పడుకునే ముందు పూసుకుని, ఉదయాన్నే స్నానం చేయవచ్చు.
* చలికాలంలో తరుచూ శరీరం పొడిబారిపోతుంటుది. కొబ్బరినూనెను ఒంటికి రాస్తే ఫలితం ఉంటుంది. పొడిబారిన చర్మానికి ఇది బాగా మేలు చేస్తుంది.
* ఒక కప్పు రోజా పువ్వు రెక్కలు, అరకప్ప పాలుతో కొద్దిగా రోజ్ వాటర్‌ను కలిపి ముద్దగా చేసుకోవాలి. కాళ్ళకు, చేతులకు ఈ మిశ్రమాన్ని పూసి బాగా మసాజ్ చేసి 15నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే చర్మం మెరుస్తుంటుంది.
* కమలాపండు తొక్కను మిక్స్‌చేసి ఆ గుజ్జును ప్రతిరోజు ముఖానికి, శరీరానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉండటంతోపాటు, చర్మం రంగు మెరుగుపడుతుంది.
* మీది జిడ్డు ముఖం అయితే ఒక నిమ్మకాయ రసంలో కాస్తంత చందనం, పసుపు వేసి బాగా కలిపాలి, ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుని గంట తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే మీ మెడ నలుపు పోయి ముఖం రంగు మెరుగు పడటమేకాక కాంతివంతంగా కనిపిస్తుంది.
* 30ల్లోకి అడుగుపెట్టగానే చాలామంది ముఖం, శరీరంపై ముడతలు వచ్చి వృద్ధాప్య లక్షణాలకు దగ్గరైపోతున్నట్లు కనిపిస్తుంటారు. అలాంటివారు పైన చెప్పిన చిట్కాలతోపాటు కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం శరీర ఆకృతిని అందంగా మారుస్తుంది. మనసు, శరీరం చరుకుగా ఉంటాయి.

No comments:

Post a Comment