17వ బాలల అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఖర్చు సుమారు 5 కోట్ల రూపాయల దాకా అవుతుందని అధికారులు లెక్కలు వేశారనీ, అందులో రాష్ట్రం 3.25 కోట్ల రూపాయలు సమకూరుస్తుందనీ, మిగిలినది కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వస్తాయని సమాచార ప్రసారశాఖ మంత్రి డి.కె. అరుణ చెప్పారు...........................నిర్వహణలో ఖర్చులు పెరిగినా పెరగవచ్చనీ, తగ్గినా తగ్గవచ్చని అన్నారు. అసలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం మనకు గర్వకారణమనీ, రెండేళ్లకోసారి బాలల చలనచిత్రోత్సవాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఆమె అన్నారు. ఏవైనా చిన్నచిన్న తప్పులుంటే... దాన్ని పెద్దది చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
గత ఏడాది 300 ఎంట్రీలు వస్తే ఈ ఏడాది 700 వచ్చాయనీ, వాటిల్లో 152 చిత్రాలను ఎంపిక చేశామని ఆమె తెలిపారు. ఈ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల కోసం శిల్పారామంలో 4 ప్రత్యేక స్క్రీన్స్‌లను ఏర్పాటు చేశామనీ, హైదరాబాద్‌తో కలిపి మొత్తం 12 స్క్రీన్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారంరోజులపాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారని ఆమె చెప్పారు.
ఈసారి ఇండియా ముందుంది: నందితాదాస్
2009లో నేను అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల బాధ్యతను తీసుకున్నాననీ, అప్పటికీ ఇప్పటికీ మన ఇండియన్ సినిమాల్లో మార్పులు వచ్చాయని ఫెస్టివల్ ఛైర్‌పర్సన్ నందితాదాస్ అన్నారు. గతంలో కంటే ఈసారి భారతీయ సినిమాలు పెరిగాయనీ అన్నారు. అందులో 'లిటిల్ డైరెక్టర్స్ కూడా ఉన్నారనిపేర్కొన్నారు.
పిల్లల చిత్రాలు వారి మేథోసంపత్తికి నిదర్శమనీ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసినవారు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారని అన్నారు. దాదాపు లక్షా 50వేల మంది బాలలు ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉత్సవాలకు శాశ్వత వేదికగా చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు.

No comments:
Post a Comment