Tuesday, April 12, 2011

మ్యాంగో శ్రీఖండ్‌

కావలసిన పదార్థాలు
గడ్డ పెరుగు - 1 లీటర్‌
చక్కర పొడి - 150 గ్రా
మామిడిపండ్ల రసం - అరకప్పు
ఏలకులు - 5

జీడిపప్పు - 15 గ్రా
తయారు చేసే విధానం
గడ్డ పెరుగును సన్నటి బట్టలో మూట కట్టి నాలుగు గంటలు వడకట్టాలి. నీరంతా పోయి గట్టిగా అయిన పెరుగు ముద్దలో చక్కెరను కలపాలి. చక్కెర కరిగి ముద్ద అయ్యాక అందులో మామిడి పండ్ల రసం, ఏలకుల పొడిని కలిపితే శ్రీఖండ్‌ తయారయినట్టే. దీనిని పూరీలతో తింటే బాగుంటుంది.

No comments:

Post a Comment