Wednesday, April 13, 2011

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రాముడు

అశేష జనవాహిని, రాష్ట్ర ప్రథమ పౌరునితో సహా పలువురు ప్రముఖులు వీక్షిస్తుండగా శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. విష్వక్సేనుడి పూజతో ఇక్ష్వాకు కుల తిలకుడైన శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 
పవిత్ర నదీ జలాలతో అష్టాదశ కలశాలు ఏర్పాటుచేసి పూజలు చేశారు. పట్టాభిరాముడికి మంగళస్నానం చేయించారు. శ్రీరామ పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణకిరీటం, ఖడ్గం, స్వర్ణఛత్రాలకు పూజలు నిర్వహించి ఒక్కటొక్కటిగా శ్రీరాముడికి సమర్పించారు. కెంపులహారం, పచ్చలపతకం, ముత్యాలహారం తదితర ఆభరణాలతో శ్రీరాముడిని అలంకరించారు. కిరీట ధారణ చేసి మంగళహారతులిచ్చారు.

No comments:

Post a Comment