Sunday, April 3, 2011

ఉగాది పచ్చడి

కావలసిన పదార్థాలు
మామిడికాయ ముక్కలు - 1 కప్పు, చింతపండు - నిమ్మకాయంత , బెల్లం - అరకప్పు, అరటిపళ్లు - 2 వేపపూవు - 4,5 రెమ్మలు, కారం/మిరియాలపొడి/పచ్చి మిర్చి - కొద్దిగా, ఉప్పు - చిటికెడు

తయారు చేసే విధానం
చింతపండు ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి రసం తియ్యాలి. మామిడికాయ, అరటిపండ్లు చిన్నచిన్న ముక్కలు చెయ్యాలి. బెల్లం, సన్నగా తరగాలి. చింతపండు రసంలో తరిగిన బెల్లం, అరటికాయ ముక్కలు వెయ్యాలి. సన్నగా కోసిన మామిడికాయ, అరటిపండు ముక్కలు, వేపపువ్వు, కారం/మిరియాల పొడి/పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలిపితే ఉగాది పచ్చడి రెడీ. ఓ ఐదు నిమిషాల తర్వాత తినేయొచ్చు. పుల్లపుల్లగా, తియ్యగా, కారంగా, ఉప్పగా చాలా బావుంటుంది. కొంచెం చేదు కూడా వుంటుందనుకోండి. ఐనా బావుంటుంది. ఇష్టాన్ని బట్టి చెరుకు, కొబ్బరిముక్కలు, ద్రాక్షపళ్లు కూడా వేసుకోవచ్చు.

No comments:

Post a Comment