ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి పరీక్షలకు 8,51,874 మంది విద్యార్థులు హాజరుకాగా 52.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొతం విద్యార్థుల్లో 4,44,747 మంది ఉత్తీర్ణులు కాగా అందులో 1,69,871 మంది ఏ గ్రేడును సాధించారు. గతేడాదితో పోలీస్తే ఫలితాల్లో 4.35 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ సారి ఫలితాల్లో బాలికలదే పైచేయి. బాలికల ఉత్తీర్ణ శాతం 56.61 కాగా, బాలుర శాతం 48.48గా ఉంది. వొకేషనల్ కోర్సులో 39.97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, నల్గొండ జిల్లా చివరి స్థానంలో ఉంది.
No comments:
Post a Comment