Friday, February 18, 2011

జగన్‌ పంచ్‌కి.. వెయ్యి కోట్లు రాలారు!

జగన్‌ పంచ్‌కి.. వెయ్యి కోట్లు రాలాయి.  చెట్టుపై నుచి కాదులెండి..! ప్రభుత్వ ఖజానా నుంచి ఫీజు రీఎంబుమెంట్‌ పథకానికి సంబంధించిన ఫీజుల నుంచి బకాయిలపై జగన్‌ 7 రోజుల దీక్షకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జగన్‌ దీక్ష కొనసాగితే  రాష్ట్ర వ్యాప్తంగా విదార్థుల ఆందోళనలు తీవ్రం అయి ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయనే ఆలోచనలో పడ్డ మంత్రులు..
హడావుడిగా మీడియా ముందుకు వచ్చిన మంత్రులు బొత్సా సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, బస్వరాజు సారయ్య ప్రస్తునికి ప్రస్తుతానికి వెయ్యి కోట్లు విడబడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మే నాటికి మరో రూ|| 514 కోట్లు విబడుదల చేస్తామన్నారు. సెప్టెంబర్‌ నాటికి పూర్తి బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కింద చదువుకునే విద్యార్థుల సంఖ్య గతంలో కంటే ఇప్పుడు గణనీయంగా పెరిగిపోఎపోయిందని, బడ్జెట్‌ కేటాయించిన నిధుల సరి పోవడం లేదని, అందుకే నిధుల విడుదలలో సజాప్యం జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. అయితే.. ప్రభుత్వ ప్రకటనపై జగన్‌ వర్గం ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకానికి సంబందించిధించి ప్రభుత్వం రాష్ట్రంలోని కళాశాలలకు 3,430 కోట్లు బకాయి ఉందని, మొత్తం చెల్లించే వరకు జగన్‌ దీక్ష కోసాగుతుందని తేల్చి చెప్నారు.,.

No comments:

Post a Comment