అరటికాయలు - 5, శనగపప్పు - 3 టీ స్పూన్లు
మినప్పప్పు - 1 టీ స్పూను, జీలకర్ర - 2 టీ స్పూన్లు
ధనియాలు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 10
నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, కరివేపాకు - 2 రెమ్మలు
తయారు చేసే విధానం
బాండీలో అర స్పూను నూనె వేసి వేడి చేయాలి. అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. చల్లారాక వాటిలో ఉప్పు వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అరటికాయలు ఉడకబెట్టిన తర్వాత పై తోలు తీసి గుండ్రంగా ముక్కలు తరగాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగాక ఉడకబెట్టిన అరటికాయ ముక్కలను వేయించాలి. తర్వాత పొడి చేసిపెట్టుకున్న పప్పుల మిశ్రమం, పసుపు, కరివేపాకు అందులో వేసి కలపాలి. అంతే అరటికాయ మసాలా వేపుడు రెడీ. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
No comments:
Post a Comment