Tuesday, February 15, 2011

ఎవ్వ రైనా ఆవిడ తర్వాతేట!

 చాలా రోజుల క్రితమే రాజకీయాల్లోకి ఎంటరైనా.. పాం మన రోజా ఇప్పటికీ ఏ పార్టీ లోనూ సెట్టవ్వలేదు. తనకున్న గ్లామర్‌తో పాటు, తన లౌడ్‌ స్వీకర్‌ను బాగా పదను పెట్టి రాజకీయాలు చేసే రోజా తనకుంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇమేజ్‌ దక్కినంత ఈజీగా రాజకీయ పదవులు దక్కడం లేదామోకు.
తొలుత టిడిపిలో చేరిన రోజా.. ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగి తన మాటల తూటాలతో సంచలనాలే సృష్టించింది. అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవక పోవడంతో అక్కడుంటే లాభం లేదని జెండా ఎత్తేసి కాంగ్రెస్‌లో దూకాలని ప్రయత్నించింది. కానీ.. వైఎస్‌ఆర్‌ హఠాన్మరణంతో ఆవిడ ఆశలు అడియాశలయ్యాయి.
అదే సమయంలో జగన్‌ తెరపైకి రావడంతో.. ఇదే మంచి తరుణమని భావించిన రోజా 'జై వైఎస్‌ఆర్‌.. జై జగన్‌' జగన్‌ శిబిరంలో దూకారు. త్వరలో జగన్‌ పార్టీ వస్తుండటంతో మహిళా నాయకురాలిగా తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదటు పెట్టింది రోజా..
ఇప్పటి వరకు జగన్‌కు మెయిన్‌ మహిళా లీడర్లుగా చెలామని అవుతున్న ఎమ్మెల్యేలు కొండా సురేఖ, జయసుధలను.. పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తోంది రోజా లౌడ్‌ స్వీకర్‌ లాంటి పెద్ద నోరు, ఆకట్టుకునే సినీ గ్లామర్‌ తసవస్వతహాగా ఉండటంతో తన స్టయిల్‌లో జగన్‌ శిబిరంలో రాజీకీయాలు మొదలు పెట్టింది. వాళ్లిదర్దద్దరినీ తన తర్వాతి స్థానానికి పరిమయమితం చేసే పనిలో తలమునకయిఒయింది.

No comments:

Post a Comment